క్యూ1తో హిందాల్కో నేలచూపు

క్యూ1తో హిందాల్కో నేలచూపు

ఆదిత్య బిర్లా గ్రూప్‌ అల్యూమినియం దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్‌ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో అమ్మకాలతో బలహీనపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 7.6 శాతం పతనమై రూ. 220 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 218 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఫలితాలు వీక్‌
క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో హిందాల్కో నికర లాభం దాదాపు 2 శాతం క్షీణించి రూ. 289.5 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 27 శాతంపైగా జంప్‌చేసి రూ. 10,407 కోట్లకు చేరింది. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో రూ. 104 కోట్లమేర వన్‌టైమ్ నష్టం నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది. దీంతో లాభదాయకత నీరసించగా.. ఇబిటా మార్జిన్లు 14.8 శాతం నుంచి 11.75 శాతానికి బలహీనపడ్డాయి.Most Popular