కళ్యాణీ స్టీల్స్‌కు క్యూ1 తుప్పు

కళ్యాణీ స్టీల్స్‌కు క్యూ1 తుప్పు

ప్రస్తుత ఏడాది తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో కళ్యానీ స్టీల్స్‌ కౌంటర్‌లో అమ్మకాలకు తెరలేచింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 8.3 శాతం కుప్పకూలి రూ. 394 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 390 వద్ద కనిష్టాన్ని తాకింది.
లాభం 41% డౌన్‌
ఇనుము, స్టీల్‌ ఉత్పత్తుల కళ్యాణీ గ్రూప్‌ సంస్థ కళ్యాణీ స్టీల్స్‌ నికర లాభం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో 41 శాతంపైగా క్షీణించి రూ. 27.4 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 11 శాతంపైగా ఎగసి రూ.383 కోట్లను అధిగమించింది.  Most Popular