బాష్‌కు క్యూ1 ఫలితాల సెగ

బాష్‌కు క్యూ1 ఫలితాల సెగ

ఆటో విడిభాగాలు, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ బాష్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో ఈ కౌంటర్‌లో అమ్మకాలకు తెరలేచింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు 4.3 శాతం పతనమై రూ. 22,600 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 22,291 వద్ద కనిష్టాన్ని తాకింది.
క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో బాష్‌ నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 303 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2904 కోట్ల నుంచి రూ. 2960 కోట్లకు స్వల్పంగా పెరిగింది. Most Popular