స్టేట్‌బ్యాంక్‌కు బకాయిల తలనొప్పి..‌!

స్టేట్‌బ్యాంక్‌కు బకాయిల తలనొప్పి..‌!

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. దీంతో ఈ కౌంటర్ అమ్మకాలతో బలహీనపడింది. ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో ఎస్‌బీఐ 5 శాతం పతనమై రూ. 282 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 278.5 వరకూ జారింది.
ఫలితాలు వీక్‌
క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఎస్‌బీఐ నికర లాభం 20 శాతంపైగా క్షీణించి రూ. 2,006 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం దాదాపు 29 శాతం పెరిగి రూ. 62,911 కోట్లను అధిగమించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 6.9 శాతం నుంచి 10 శాతానికి ఎగశాయి. నికర ఎన్‌పీఏలు సైతం 3.71 శాతం నుంచి దాదాపు 6 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు 20 శాతం పెరిగి రూ. 8929 కోట్లను తాకాయి. Most Popular