పసిడి మెరుపులు...!

పసిడి మెరుపులు...!

 

 అమెరికా, ఉత్తర కొరియాల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన భయానక వాతావరణం కారణంగా  బంగారానికి డిమాండ్ పెరిగుతోంది.బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో రోజు రోజుకీ పై పైకీ వెళుతున్నాయి.  దీంతో గత రెండు నెలల కాలంలో బంగారం గరిష్ట స్థాయిలకు చేరుకుందని విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ధర 0.7 శాతం పెరిగి, ఒక్కో ఔన్స్‌కు 1,286.07 డాలర్లుగా నమోదైంది. జూన్‌ 8 తర్వాత అత్యంత గరిష్ట స్థాయి 1,286.4 డాలర్లను తాకింది.  డిసెంబర్‌ నెల అమెరికా గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 1 శాతం పెరిగి ఒక్కో ఔన్స్‌కు 1,291.8 డాలర్లుగా రికార్డు అయ్యాయి. ఇక సిల్వర్‌  1.7 శాతం పైకి ఎగిసింది. 17.24 డాలర్ల గరిష్ట స్థాయిలను తాకిన తర్వాత ఒక్కో ఔన్స్‌కు 17.20 డాలర్లుగా సిల్వర్‌ నమోదైంది. జూన్‌ 14 తర్వాత ఇదే అత్యంత గరిష్ట స్థాయి. ఓ వైపు నాలుగు రోజులుగా మన స్టాక్‌ మార్కెట్లు నష్టాలు చవి చూస్తుంటే..అటు బంగారం మాత్రం మిల మిల మెరుస్తోంది.  ఇండియాలో కూడా శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక్కసారే రూ. 344 మేర పెరిగాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌ మార్కెట్లో పది గ్రాముల ప్యూర్‌ గోల్డ్‌ అక్టోబర్‌ డెలివరి రూ.74 లు పెరిగి  రూ.29,250 వద్ద  ట్రేడౌతోంది. అలాగే కేజీ సిల్వర్‌ సెప్టెంబర్‌ డెలివరీ రూ.137 పెరిగి  రూ.39,350 వద్ద ట్రేడౌతోందిMost Popular