300 పాయింట్లు డౌన్‌- ప్రభుత్వ బ్యాంకులు కుదేల్‌

300 పాయింట్లు డౌన్‌- ప్రభుత్వ బ్యాంకులు కుదేల్‌

మిడ్‌సెషన్‌ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్లు మళ్లీ బేర్‌మంటున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 307 పాయింట్లు పతనమై 32,213ను తాకింది. నిఫ్టీ సైతం 101 పాయింట్లు పడిపోయి 9,719కు చేరింది. ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ దాదాపు 4 శాతం పతనంకాగా.. మెటల్ 2.3 శాతం‌, ఆటో 1.5 శాతం చొప్పున దిగజారాయి. అయితే ఫార్మా 0.4 శాతం బలపడింది. ఉత్తర కొరియా- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు దెబ్బతింది. దీంతో యూరప్‌, అమెరికా, ఆసియా మార్కెట్లన్నీ రెండు రోజులుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. 
పీఎస్‌యూ బ్యాంక్స్‌ బోర్లా
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ కౌంటర్లలో యూనియన్‌ బ్యాంక్‌, స్టేట్‌బ్యాంక్‌, బీవోబీ, ఓబీసీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌, అలహాబాద్‌, ఆంధ్రా బ్యాంక్‌, పీఎన్‌బీ, కెనరా 6-1.5 శాతం మధ్య తిరోగమించాయి. ఈ బాటలో మెటల్‌ దిగ్గజాలు హిందాల్కో, వేదాంతా‌ 4.5 శాతంపైగా పతనంకాగా.. ఎంఅండ్ఎం, మారుతీ, టాటా మోటార్స్‌, ఐషర్‌తోపాటు ఆర్‌ఐఎల్‌ 3-2 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్‌ రెడ్డీస్‌, అల్ట్రాటెక్‌, గెయిల్‌, అరబిందో, బీపీసీఎల్‌, పవర్‌గ్రిడ్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, యస్‌బ్యాంక్‌, యాక్సిస్‌ 3.5-0.5 శాతం మధ్య బలపడ్డాయి. Most Popular