యూరప్‌ను వీడని యుద్ధ భయాలు!

యూరప్‌ను వీడని యుద్ధ భయాలు!

గువామ్‌ లేదా ఏ ఇతర సైనిక స్థావరంపైన అయినా క్షిపణి ప్రయోగాలు చేస్తే తీవ్ర చర్యలు తప్పవంటూ తాజాగా అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఉత్తర కొరియాను హెచ్చరించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. దీంతో ఇప్పటికే గురువారం యూరప్‌, అమెరికా స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనంకాగా.. ప్రస్తుతం ఆసియా, యూరప్‌ మార్కెట్లు మరోసారి నష్టాలతో కదులుతున్నాయి. యూరప్‌ మార్కెట్లలో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌, యూకే 0.5-1 శాతం మధ్య క్షీణతతో ట్రేడవుతున్నాయి.
ఆసియాలోనూ ఆందోళనలు
ఉత్తర కొరియా- అమెరికా మధ్య పెరుగుతున్న వైరం ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాలకు కారణమవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌, కొరియా, చైనా దాదాపు 2 శాతం చొప్పున పతనంకాగా.. సింగపూర్‌, ఇండొనేసియా, థాయ్‌లాండ్‌ 1-0.6 శాతం మధ్య క్షీణించాయి. జపాన్‌ మార్కెట్‌కు సెలవుకాగా.. తైవాన్‌ దాదాపు యథాతథంగా నిలిచింది.Most Popular