నష్టాలలోనే మార్కెట్లు- మెటల్స్‌ వీక్‌

నష్టాలలోనే మార్కెట్లు- మెటల్స్‌ వీక్‌

భారీ నష్టాలతో మొదలైన మార్కెట్లు కొంతమేర కోలుకున్నప్పటికీ బలహీనంగానే కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 182 పాయింట్ల క్షీణతతో 32,348కు చేరగా.. నిఫ్టీ 62 పాయింట్ల వెనకడుగుతో 9,758 వద్ద ట్రేడవుతోంది. అయితే కొనుగోళ్ల కారణంగా ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ రంగాలు 0.6-1.2 శాతం మధ్య పుంజుకున్నాయి. మరోపక్క మెటల్ 1.4 శాతం‌, ఆటో 0.65 శాతం చొప్పున నీరసించాయి.
ఎఫ్‌అండ్‌వోలో
డెరివేటివ్‌ షేర్లలో మణప్పురం, జేపీ, ఐసీఐఎల్‌, వేదాంతా, హిందాల్కో, యూబీఐ, అదానీ పవర్‌, పీఎఫ్‌సీ, ఐఎఫ్‌సీఐ, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ 7-3 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే బీఈఎంఎల్‌, హెచ్‌డీఐఎల్‌, సన్‌ టీవీ, సింటెక్స్‌, హెచ్‌పీసీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండియా సిమెంట్స్‌, గ్రాన్యూల్స్‌, హెచ్‌పీసీఎల్‌, కావేరీ సీడ్స్‌, ఇండియన్‌ బ్యాంక్‌ 6-3 శాతం మధ్య జంప్‌చేశాయి.Most Popular