యుద్ధ మేఘాలతో పసిడి జిగేల్‌ 

యుద్ధ మేఘాలతో పసిడి జిగేల్‌ 

ఉత్తర కొరియా-అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం బంగారానికి డిమాండ్‌ పెంచుతోంది. దీంతో విదేశీ మార్కెట్లో వరుసగా నాలుగో రోజు ధరలకు రెక్కలొచ్చాయ్‌. ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం 0.2 శాతం(2 డాలర్లు) బలపడి 1292 డాలర్లను తాకింది. తద్వారా పసిడి ధరలు రెండు నెలల గరిష్టాలను తాకాయి. ఈ బాటలో వెండి సైతం ప్రస్తుతం ఔన్స్‌ 17 డాలర్లను అధిగమించి కదులుతోంది. 
నాలుగు రోజులుగా
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల నేపథ్యంలోనూ క్షిపణి పరీక్షలకు సన్నాహాలు చేస్తున్న ఉత్తర కొరియాపై అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఫైర్‌కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు తెరలేచింది. అమెరికా సైనిక స్థావరానికి సమీపంలో ఉన్న గామ్‌పై ఉత్తర కొరియా మిస్సైల్‌ ప్రయోగ పరీక్ష చేపట్టనున్నట్లు వార్తలు వెలువడగా.. అమెరికా ప్రెసిండెట్‌ ట్రంప్‌ ఉత్తర కొరియాపై తీవ్ర చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించడంతో బంగారానికి డిమాండ్‌ పెరిగింది. విపత్కర పరిస్థితుల్లో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడిలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో గత నాలుగు రోజులుగా పసిడి ధరలు మెరుస్తున్నాయ్‌.Most Popular