సెప్టెంబర్‌ 9న హైదరాబాద్‌లో  జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

సెప్టెంబర్‌ 9న హైదరాబాద్‌లో  జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

 

 జీఎస్టీ అమల్లో ఎదురౌతున్న సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటైన జీఎస్టీ కౌన్సిల్‌ 21వ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కౌన్సిల్‌ తర్వాతి సమావేశం వచ్చే నెల 9న హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, వాణిజ్య పన్నుల శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు హాజరవుతారు.
 Most Popular