సెన్సెక్స్‌ 262 పాయింట్లు డౌన్‌ 

సెన్సెక్స్‌ 262 పాయింట్లు డౌన్‌ 

ఉత్తర కొరియా-అమెరికా మధ్య యుద్ధభయాలు, షెల్‌ కంపెనీలపై సెబీ చర్యలు తదితర ప్రతికూల అంశాల నడుమ దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 262 పాయింట్లు పతనమై 32,269కు చేరగా.. నిఫ్టీ 87 పాయింట్లు క్షీణించి 9,733 వద్ద కదులుతోంది. గురువారం యూరప్‌, అమెరికా మార్కెట్లు భారీ నష్టాలకు లోనుకావడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 32,000 పాయింట్ల మైలురాయి దిగువకు చేరుకుంది. ఈ బాటలో నిఫ్టీ సైతం 9,700 స్థాయికి దిగజారింది.
ఐటీ మినహా
ఎన్‌ఎస్ఈలో ఐటీ మినహా అన్ని రంగాలూ నష్టపోయాయి. ఆటో, మెటల్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ 1.5-1 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో వేదాంతా, హిందాల్కో, జీ, టాటా మోటార్స్‌, ఐషర్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సిప్లా, ఓఎన్‌జీసీ, హీరోమోటో, బాష్‌ 2-1.5 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే టెక్‌మహీంద్రా, అరబిందో, లుపిన్‌, గెయిల్‌, విప్రో 1.2-0.6 శాతం మధ్య బలపడ్డాయి.Most Popular