ఆసియా మార్కెట్లపై యుద్ధమేఘాలు!

ఆసియా మార్కెట్లపై యుద్ధమేఘాలు!

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల నేపథ్యంలోనూ క్షిపణి పరీక్షలకు సన్నాహాలు చేస్తున్న ఉత్తర కొరియాపై అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఫైర్‌కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు తెరలేచింది. అమెరికాను లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవంటూ ట్రంప్‌ కొరియాను హెచ్చరించారు. అయినప్పటికీ అమెరికా సైనిక స్థావరానికి సమీపంలో ఉన్న గువామ్‌పై క్షిపణి పరీక్ష చేపట్టనున్నట్లు తాజాగా ఉత్తర కొరియా ప్రకటించింది. దీంతో వరుసగా మూడో రోజు యూరప్‌, అమెరికా మార్కెట్లు నీరసించగా.. ప్రస్తుతం ఆసియాలోనూ ప్రతికూల సెంటిమెంటు కనిపిస్తోంది. యుద్ధవాతావరణం కారణంగా ఇన్వెస్టర్లు బంగారం, జపనీస్‌ కరెన్సీ యెన్‌, ట్రెజరీ సెక్యూరిటీలు వంటి రక్షణాత్మక పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తున్నారని, దీంతో ఈక్విటీలలో అమ్మకాలు నమోదవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.  
అన్ని మార్కెట్లూ డీలా 
ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌, కొరియా, చైనా, సింగపూర్‌, ఇండొనేసియా 2-1 శాతం మధ్య పతనంకాగా.. థాయ్‌లాండ్‌ 0.5 శాతం, తైవాన్‌ 0.25 శాతం చొప్పున క్షీణించాయి. జపాన్‌ మార్కెట్లకు సెలవు.Most Popular