ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16వేల కోట్ల భారీ పెట్టుబడులు

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16వేల కోట్ల భారీ పెట్టుబడులు

 

అమెజాన్‌కి గట్టి పోటీ ఇవ్వాలని ఫ్లిప్‌కార్ట్‌ డిసైడ్‌ అయ్యింది. ఈ-కామర్స్‌ మార్కెట్లో దిగ్గజ కంపెనీలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ రోజుకో కొత్త న్యూస్‌తో హల్‌చల్‌ చేస్తున్నారు. తాజాగా జపనీస్‌ బ్యాంక్‌ సాఫ్ట్‌ బ్యాంక్‌ తన విజన్‌ ఫండ్‌ ద్వారా 2.5 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.16,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లో అతి పెద్ద ఇన్వెస్టర్లలో ఒకటిగా మారింది సాఫ్ట్‌బ్యాంక్‌. ఫ్లిప్‌కార్ట్‌ లో టైగర్‌ గ్లోబర్‌ లీడింగ్‌  ఇన్వెస్టర్‌గా ఉండగా ఇప్పుడు 18శాతం వాటాను సాఫ్ట్‌బ్యాంక్‌ సొంతం చేసుకొంది. తాజాగా ప్రకటించిన  2.5 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌మెంట్‌లో 1.5 బిలియన్‌ డాలర్లు నేరుగా ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్‌ చేయగా, మిగతా 1 బిలియన్‌ డాలర్లను టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ వాటాలో కొంత భాగాన్ని కొనేందుకు సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ ఖర్చుచేస్తోందని తెలుస్తోంది.  ఈ వార్తలపై ఫ్లిప్‌కార్ట్‌ పాజిటివ్‌గా స్పందించినా..ఎంత మేర పెట్టుబడులొచ్చాయనే విషయం మాత్రం వెల్లడించలేదు.

ఇండియన్‌ ఈ-కామర్స్‌ మార్కెట్‌ ఏటా 30% వృద్ధి:
మన దేశంలో ఈ–కామర్స్‌ మార్కెట్‌ ఏటా 30 శాతం పైగా వృద్ధి చెందుతోన్న నేపథ్యంలో మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి ఈ నిధులు దోహదపడతాయని ఫ్లిప్‌కార్ట్ అంటోంది . ఈ డీల్‌ తమకు చిరస్మరణీయమైనదని.. అంతర్జాతీయంగా కొన్ని దేశాలకు చెందిన కొన్ని కంపెనీలే గ్లోబల్‌ ఇన్వెస్టర్లను ఆకర్షించగలవని ఫిప్‌కార్ట్‌ కో-ఫౌండర్స్‌ బిన్నీ బన్సల్‌ , సచిన్‌ బన్సల్‌ పేర్కొన్నారు.
 Most Popular