సౌత్ జున్‌జున్‌వాలా పట్టిన మల్టీబ్యాగర్స్ ఏంటో తెలుసా?

సౌత్ జున్‌జున్‌వాలా పట్టిన మల్టీబ్యాగర్స్ ఏంటో తెలుసా?


డాలీ ఖన్నా గురించి ఇన్వెస్టర్ సర్కిల్‌కు బాగానే తెలుసు. ఈ చెన్నై బేస్డ్ ఇన్వెస్టర్ అకౌంట్‌లో ఉండే స్టాక్స్ గురించి ఆరా తీయడంపై జనాల్లో కూడా ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే జంట డాలీ ఖన్నా- రాజీవ్ ఖన్నా. భార్య డాలీ ఖన్నా పేరుపై రాజీవ్ ఖన్నానే ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. జూన్ త్రైమాసికం ముగిసేసరికి ఆమె పోర్ట్‌ఫోలియోలో 20 సెక్యూరిటీలు ఉన్నాయి. తన పోర్ట్‌ఫోలియోలో ఉన్న 20 స్టాక్స్‌కు గాను, తొమ్మిదింటిలో వాటాలను పెంచుకున్నారు డాలీ ఖన్నా. అలాగే 8 స్టాక్స్‌లో లాభాలను బుక్ చేసుకోగా మూడింటిలో మాత్రం పెట్టుబడులను యథాతథ స్థాయిలో కొనసాగించారు. 

1996లో రూ. 1 కోటి పెట్టుబడితో మార్కెట్లో పెట్టుబడులు చేయడం ఆరంభించిన రాజీవ్ ఖన్నా నెట్వర్త్ ప్రస్తుతం రూ. 400 కోట్లకు పైగానే ఉంటుంది. నీల్‌కమల్, స్టెర్లింగ్ టూల్స్, నందన్ డెనిమ్స్ వంటి కొన్ని స్టాక్స్ గత ఐదేళ్లలో 100-600 శాతం రిటర్న్‌లను ఇచ్చాయి. తిరుమలై కెమికల్స్, ద్వారికేషన్ షుగర్స్, రుచిరా పేపర్స్ వంటి స్టాక్స్ అయితే ఇదే కాలంలో 1000 శాతం, అంటే పెట్టుబడికి 10 రెట్లు రాబడులను అందించాయి. 

మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు చేయడం వీరి ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాల్లో  ప్రధానమైన విషయం. జూన్ త్రైమాసికంలో వాటాలు పెంచుకున్న స్టాక్స్‌లో రెయిన్ ఇండస్ట్రీస్(1.27 శాతం), శ్రేయాన్స్ ఇండస్ట్రీస్(1.09శాతం) ఉన్నాయి. నహర్ ఇండస్ట్రియల్ ఎంటర్‌ప్రైజెస్, ఏడీఎఫ్ ఫుడ్స్ వంటి వాటిలో వీరి వాటా ఇప్పుడు 1 శాతం కంటే దిగువకు చేరుకుంది.

 
పోర్ట్‌ఫోలియోలోని 20 స్టాక్స్‌లో 2 మాత్రం 2017లో కొంత నెగిటివ్ రాబడులను అందించాయి. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి 6 స్టాక్స్ రెట్టింపునకు పైగా పెరిగాయి. ఎల్‌టీ ఫుడ్స్, ద్వారికేష్ షుగర్స్, నోసిల్, టాటా మెటాలిక్స్, నితిన్ స్పిన్నర్స్‌లు రెట్టింపునకు పైగా పెరగగా.. వీటిలో వాటాలను డాలీ ఖన్నా పెంచుకున్నారు. పీపీఏపీ ఆటోమోటివ్, ధంపూర్ షుగర్స్ స్టాక్స్ కూడా మల్టీబ్యాగర్స్‌గా అవతరించగా పీపీఏపీలో ఇన్వెస్ట్‌మెంట్ యథాతథ స్థాయిలో కొనసాగింది. ధంపూర్ షుగర్‌లో మాత్రం స్వల్పంగా తగ్గించుకున్నారు.

టాటా మెటాలిక్స్‌లో అత్యధికంగా 0.16 శాతం వాటాను పెంచుకోగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఏషియన్ గ్రానైటో, ద్వారికేష్ షుగర్, నితిన్ స్పిన్నర్స్ ఉన్నాయి.

ఐఎఫ్‌బీ ఆగ్రో ఇండస్ట్రీస్, డాయి-చి కర్కరి, స్టెర్లింగ్ టూల్స్, నందన్ డెనిమ్, జీఎన్‌ఎఫ్‌సీ, ట్రైడెంట్, తిరుమలై కెమికల్స్, ధంపూర్ షుగర్స్‌లో వాటాలను డాలీ ఖన్నా స్వల్పంగా విక్రయించారు.
 Most Popular