మార్కెట్ల పతనం-రియల్టీ బేర్‌, ఆటో స్కిడ్‌!

మార్కెట్ల పతనం-రియల్టీ బేర్‌, ఆటో స్కిడ్‌!

రియల్టీ, ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంక్‌, ఫార్మా రంగ కౌంటర్లలో భారీ అమ్మకాలతో మార్కెట్లు పతనబాట పట్టాయి. ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాలూ భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 215 పాయింట్లు పతనమై 31,582ను తాకగా.. నిఫ్టీ 85 పాయింట్లు క్షీణించి 9,822కు చేరింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,850 దిగువన ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ 5 శాతం కుప్పకూలగా.. ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా, మెటల్ రంగాలు 3-1.5 శాతం మధ్య తిరోగమించాయి. ఐటీ ఇండెక్స్‌ 0.5 శాతం బలపడింది.
రియల్టీ బేర్‌
రియల్టీ షేర్లలో ఇండియాబుల్స్‌ 12 శాతం కుప్పకూలగా.. డీఎల్‌ఎఫ్‌, యూనిటెక్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, శోభా, ఒబెరాయ్‌, డెల్టాకార్ప్‌, ఫీనిక్స్‌, హెచ్‌డీఐఎల్‌ 9-1 శాతం మధ్య పతనమయ్యాయి. మరోవైపు నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్ 8 శాతం పడిపోగా..  గెయిల్‌, ఐషర్‌, బీవోబీ, బీపీసీఎల్‌, సన్‌ ఫార్మా, జీ, డాక్టర్‌ రెడ్డీస్‌, అదానీ పోర్ట్స్‌ 5.4-2.5 శాతం మధ్య క్షీణించాయి. అయితే మరోవైపు టెక్‌మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టాటా పవర్‌, హీరోమోటో, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ 2.7-0.4 శాతం మధ్య బలపడ్డాయి. 
చిన్న షేర్లు నేలచూపు
మార్కెట్ల బాటలో చిన్న షేర్లలోనూ భారీ అమ్మకాలు నమోదవుతున్నాయి. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 3 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 2,119 తిరొగమిస్తే.. కేవలం 377 బలపడ్డాయి.Most Popular