అరబిందో ఫార్మా యాజమాన్యాన్ని ఆడేసుకున్న జున్‌జున్‌వాలా !

అరబిందో ఫార్మా యాజమాన్యాన్ని ఆడేసుకున్న జున్‌జున్‌వాలా !


జూన్ త్రైమాసికం చివరకు ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలాకు అరబిందో ఫార్మాలో 1.12 శాతం వాటా ఉంది. ఈయన తాజాగా ఒక కాన్ఫరెన్స్ కాల్‌లో యూఎస్ మార్కెట్‌లో కంపెనీ పరిస్థితిపై కంపెనీ వర్గాలను ప్రశ్నించారు. 

యూఎస్‌లో ఎదుర్కొంటున్న ధరల ఒత్తిడి, అక్కడి మార్కెట్‌పై కంపెనీ ప్రకటించిన ఆర్థిక ఫలితాలను జున్‌జున్‌వాలా ప్రశ్నించడంతోపాటు.. అమెరికాలో అడుగంటిన లాభదాయకతపై అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.గోవిందరాజన్‌ను నిలదీశారు. ధరల విషయంలో అనేక కంపెనీ అగ్రెసివ్‌గా ఉండడంతో, ఈ పరిస్థితి జనరలైజ్ చేయడం సరికాదని గోవింద రాజన్ అభిప్రాయపడ్డారు. అయితే తాను భవిష్యత్తును అంచనా వేయడం లేదన్న రాకేష్ జున్‌జున్‌వాలా.. గతేడాది పోల్చితే మాత్రమే ఇలా వ్యాపారం అడుగంటినట్లుగా కనిపిస్తుందని.. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను.. గతేడాది నాలుగో త్రైమాసికంతో పోల్చినపుడు అంతగా మార్పులు ఉండని విషయాన్ని గుర్తు చేశారు.

ప్రధాన ఉత్పత్తుల విషయంలో మరీ ఎక్కువగా తరుగుదల లేదని 3-5 మాత్రమే పెరుగదల లేదా తగ్గుదల ఉన్నాయని కంపెనీ వర్గాల అంటున్నాయి. ఇండస్ట్రీ పరిస్థితి ఇంతకు మించి దిగజారదని అనేందుకు ఇది సంకేతమా అన్న జున్‌జున్‌వాలా  ప్రశ్నకు.. అవకాశం ఉందనే సమాధానం ఎదురైంది. ఈ ఏడాది యూరోప్ మార్కెట్‌లో ఎబిటా, టర్నోవర్ ఎలా ఉంటాయని బడా ఇన్వెస్టర్ అడిగారు.

ఈ ఏడాది ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో యూరోప్ ఎబిటా మార్జిన్లు రెండంకెల స్థాయికి తగ్గాయని అరబిందో ఎండీ చెప్పారు. మొత్తం ఆదాయం 18.1 శాతం వృద్ధి రూ. 831 కోట్లుగా నమోదు కాగా, యూరోప్ ఫార్ములేషన్స్ 25 శాతం పెరిగాయని అరబిందో వర్గాలు అంటున్నాయి. ప్రొడక్ట్ తయారీ, ధరలపై దృష్టి పెట్టడంతో లాభదాయకత పెరుగుతోందని చెప్పారు.

2014 జనవరిలో నష్టాలను నమోదు చేస్తున్న ఆక్టవీస్ పీఎల్‌సీ యూరోప్ కమర్షియల్ ఆపరేషన్స్‌ను 30 మిలియన్ల యూరోలకు అరబిందో కొనుగోలు చేసింది. దేశంలో మూడో అతి పెద్ద డ్రగ్ తయారీ సంస్థగా ఉన్న అరబిందో ఫార్మా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ. 518.5 కోట్ల నికర లాభాలను ప్రకటించగా, గతేడాదితో పోల్చితే ఇది 11.4 శాతం తక్కువ. ఆదాయం కూడా 2.3 శాతం తగ్గి 3,678.75 కోట్లుగా నమోదైంది.Most Popular