ఎస్‌ఐఎస్‌ లిస్టింగ్‌ నేడు!

ఎస్‌ఐఎస్‌ లిస్టింగ్‌ నేడు!

ఇటీవలే విజయవంతంగా పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న సెక్యూరిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీసెస్‌(ఎస్‌ఐఎస్‌) లిమిటెడ్‌ నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. జూలై 31న మొదలై ఆగస్ట్‌ 2న ముగిసిన ఇష్యూకి దాదాపు 7 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. షేరుకి రూ. 805-815 ధరల శ్రేణితో వచ్చిన ఇష్యూలో భాగంగా కంపెనీ 53.16 లక్షల షేర్లను విక్రయానికి ఉంచింది. అయితే 3.63 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 780 కోట్లను సమీకరించింది. ఇష్యూలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్లకు షేరుకి రూ. 815 ధరలో 43 లక్షలకుపైగా షేర్లను విక్రయించింది. 
ఇతర వివరాలివీ
సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం నుంచి 5.64 రెట్లు అధికంగా, సంపన్న వర్గాల నుంచి 1.66 రెట్లు ఎక్కువగానూ బిడ్స్‌ దాఖలయ్యాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు మాత్రం ఇష్యూకి క్యూకట్టి దాదాపు 19 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. ఐపీవో నిధుల్లో అత్యధిక భాగం రుణచెల్లింపులకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. Most Popular