వచ్చే ఏడాది ఐపీఓకి రానున్న క్రిస్టల్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌!!

వచ్చే ఏడాది ఐపీఓకి రానున్న క్రిస్టల్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌!!

 

వ్యవసాయరంగానికి పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో రైతుల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా, ఆగ్రో కెమికల్‌ విభాగంలో ఉన్న ప్రముఖ ఆగ్రో కెమికల్‌ కంపెనీ క్రిస్టల్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌ ప్రై.లి ఐపీఓ కు వచ్చేందుకు ప్లాన్‌ చేస్తోంది. రూ.1000 కోట్లు సమీకరించే లక్ష్యంగా ఐపీఓ రాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఆగ్రో కెమికల్స్‌ తో పాటు వ్యవసాయ పని ముట్లు తయారీలో ఉన్న  ఈ ఢిల్లీ బేస్డ్‌ కంపెనీ సీడ్స్‌ సప్లైయర్‌గా కూడా వ్యవహరిస్తోంది. సంస్థ పురుగుల, శిలీంధ్రాలు, కలుపు సంహారకాలు, మొక్క పెరుగుదల నియంత్రకాలుతో పాటు సూక్ష్మ పోషక తయారీదారుగా ఉంది. ఇది ఆఫ్రికా, పశ్చిమ ఆసియా , సౌత్ ఈస్ట్ ఆసియాలోని 10 పైగా దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది.Most Popular