మీకు రెండు పాన్‌ కార్డులున్నాయా..ఇలా సరండర్ చేయండి...!

మీకు రెండు పాన్‌ కార్డులున్నాయా..ఇలా సరండర్ చేయండి...!

 

పర్మినెంట్‌ ఎకౌంట్‌ నెంబర్‌గా అందరికీ సుపరిచతమైనది పాన్‌ కార్డ్‌. ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్‌తో లావా దేవీలు చేస్తున్న తరుణంలో పాన్ కార్డు తప్పనిసరి. పాన్ కార్డును బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చెయ్యడానికి, సెక్యూరిటీలతో పాటు మొదలైన ఆర్దిక లావాదేవీల విషయాల్లో ఉపయోగిస్తారు. అయితే ఇప్పడు పాన్‌ కార్డుని ఆధార్‌తో అనుసంధానం చేయమంటోంది ప్రభుత్వం. దీనికి గడువును ఆగష్టు 31 వరకూ ఇచ్చింది. ఇప్పటికే 11.44లక్షల ఫేక్ పాన్ కార్డులను డీ యాక్టివేట్ చేసింది ప్రభుత్వం.  ఇంకా ఫేక్ పాన్ కార్డులున్నాయని గుర్తించింది.  ఒక్కరే రెండు లేదా అంతకన్నా ఎక్కువ పాన్‌ కార్డులు కలిగి వుంటే ఆధార్ తో పాన్ లింక్ చేయడం ద్వారా ఈజీగా తెలసిపోతుంది. మీకు గనుక మీ చిరునామాతో రెండు పాన్ కార్డులను కలిగి ఉన్నట్లైతే... ప్రభుత్వం మీకు లీగల్ నోటీసుతో పాటు, ఆదాయ పన్ను చట్టం ప్రకారం సెక్షన్‌ 272 బి ప్రకారం రూ. 10,000 జరిమానా విధిస్తుంది. 

ఎలా సరండర్‌ చేయాలి..?


తెలిసి చేసినా..తెలియక చేసినా ఒకే వ్యక్తి కి రెండు పాన్‌ కార్డులు మాత్రం ఉండకూడదంటోంది ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌. ఇలా ఎవరైనా  రెండు పాన్ కార్డులను కలిగి ఉన్నట్లైతే ఆన్ లైన్‌లో https://incometax.intelenetglobal.com/pan/newPAN.asp అనే వెబ్ సైట్‌కి లాగిన్ అయి తన వద్ద ఉన్న రెండవ పాన్ కార్డు సమాచారాన్ని ఇన్ కమ్ టాక్స్ వెబ్ సైట్‌లో జత చేయాలి. ఇక ఆఫ్ లైన్‌లో రెండవ పాన్ కార్డు సమాచారాన్ని అందజేయాలంటే లిఖిత పూర్వకంగా లెటర్ వ్రాసి NSDL TIN ఫెసిలిటేషన్ సెంటర్ లేదా UTI PAN సెంటర్‌‌లో ఉన్న అధికారులకు అందజేయాలి. అప్లికేషన్‌లో ఉన్న చివరి కాలమ్‌లో రెండవ పాన్ కార్డు సమాచారాన్ని క్లుప్తంగా వ్రాయాలి. ఎవరైతే వ్యక్తి రెండవ పాన్ కార్డుని కలిగి ఉంటారో అప్లికేషన్‌లో పూర్తి పేరు, పూర్తి చిరునామాతో పాటు పాన్ కార్డు డిటేల్స్ వ్రాయాలి. ఆ తర్వాత సదరు అధికారి మీకు రెండవ పాన్ కార్డు‌ సమాచారాన్ని అందజేసినట్లు మీరు రసీదు ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీ రెండో పాన్‌ కార్డును సరండర్‌ చేస్తే సరిపోతుంది. Most Popular