స్వల్ప ఒడిదుడుకులు- రియల్టీ జోరు!

స్వల్ప ఒడిదుడుకులు- రియల్టీ జోరు!

మార్కెట్లను ప్రభావితం చేయగల ప్రధాన అంశాలు కరవుకావడంతో ఇండెక్సులు కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. స్వల్ప ఒడుదుడుకులను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 12 పాయింట్లు క్షీణించి 32,313కు చేరగా.. నిఫ్టీ 2 పాయింట్లు బలపడి 10,069 వద్ద కదులుతోంది. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ అత్యధికంగా 2.2 శాతం జంప్‌చేయగా.. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ సైతం 1.6 శాతం ఎగసింది. అయితే ఐటీ 0.7 శాతం వెనకడుగులో ఉంది.
బ్లూచిప్స్‌లో
రియల్టీ షేర్లలో ఇండియాబుల్స్‌, యూనిటెక్, డెల్టాకార్ప్‌, ఫీనిక్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌ 8-1 శాతం మధ్య దూసుకెళ్లాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్‌, ఐవోసీ, బీపీసీఎల్‌, అదానీ పోర్ట్స్‌, స్టేట్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ, ఐషర్‌, మారుతీ, గెయిల్‌, హిందాల్కో 4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే మరోవైపు ఇన్‌ఫ్రాటెల్‌, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌, భారతీ, ఇండస్‌ఇండ్, బాష్‌ 2-0.8 శాతం మధ్య లాభపడ్డాయి.Most Popular