మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయేందుకు కారణాలు

మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయేందుకు కారణాలు


ఆరోగ్య బీమా తీసుకుంటే పలు రకాల అనారోగ్యాల గురించి భయపడాల్సిన అవసరం లేదని భావించడం సహజం. అయితే, కొన్నిసార్లు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా.. అనుకోని పరిస్థితుల్లో మీ క్లెయిం రిజెక్ట్ అయేందుకు అవకాశం ఉంటుంది. ఏఏ పరిస్థితుల్లో మీ బీమా క్లెయిం కానీ, క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్ సదుపాయం కానీ రిజెక్ట్ అయేందుకు అవకాశం ఉందో తెలుసుకుందాం.

ముందస్తుగా ఉన్న వ్యాధులు
ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ విషయంలో బీమా కంపెనీలు చాలా కఠినంగా ఉంటాయి. పాలసీ తీసుకునే సమయానికే ఉన్న అనారోగ్యాలకు బీమా సదుపాయం వెంటనే కల్పించవు. కంపెనీని అనుసరించి పాలసీ ప్రకారం 3 నుంచి 4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ అమల్లో ఉంటుంది. ఆ గడువు ముగిసిన తర్వాత మాత్రమే, మీకు ఇప్పటికే ఉన్న వ్యాధుల చికిత్సకు మీకు అనుమతి ఇస్తాయి. 

పాలసీ మినహాయింపులు
కొన్ని రకాల వ్యాధులకు హెల్త్ పాలసీల నుంచి మినహాయింపు ఉంటుంది. వీటికి కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే బీమా కంపెనీలు కవరేజ్ ఇస్తాయి. కంటి చూపు, దంత సంబంధిత, కాస్మెటిక్ సర్జరీలు, డయాగ్నసిస్, ప్రెగ్నెన్సీ వంటి వాటికి కొంత వెయిటింగ్ పీరియడ్‌తో పాటు బీమా చెల్లింపులపై పరిమితి ఉంటుంది.

రెన్యూవల్‌కు అంతరం
ఆరోగ్య బీమా కవరేజ్ ముగింపు తేదీకి 15 రోజుల వరకు ప్రీమియం చెల్లించేందుకు గడువు ఉంటుంది. అయితే, ఈ సమయంలో కవరేజ్ మాత్రం అందుబాటులో ఉండదు.

పాలసీ కవరేజ్
రూమ్ రెంట్, కన్సల్టెన్సీ ఫీజులు, అంబులెన్స్ ఛార్జీలు వంటి ఖర్చులపై పాలసీలో పలు రకాల పరిమితులు, సబ్‌ లిమిట్స్‌ను ఆరోగ్య బీమా అందించే కంపెనీలు విధిస్తూ ఉంటాయి.

సరికాని సమాచారం
మీరు పాలసీ తీసుకునే సమయంలో ఇచ్చిన సమాచారంలో ఏదైనా తప్పులు ఉన్నా, ఉద్దేశ్యపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టినా.. ఆ తర్వాతి కాలంలో అవి తెలిస్తే మాత్రం మీ క్లెయిమ్‌ను తిరస్కరణకు గురి కావచ్చు.Most Popular