టాక్స్‌ ఫైలింగ్‌కు ఇవాళే లాస్ట్‌ ఛాన్స్..!

టాక్స్‌ ఫైలింగ్‌కు ఇవాళే లాస్ట్‌ ఛాన్స్..!

ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు 2016-17 సంవత్సరానికి గాకు ట్యాక్స్‌ రిటర్న్స్‌ చేసేందుకు శనివారంతో గడువు ముగియనుంది. దీంతో ఈ రోజు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసులు ఈ అర్థరాత్రి వరకూ పని చేయనున్నాయి. గత నెల31 నాటికే గడువు ముగిసినా ఆ రోజు ఉన్న విపరీతమైన రద్దీ..కొన్ని సాంకేతిక అవాంతరాలు కారణంగా ఈ నెల 5వ తారీఖు వరకూ గడువు పొడిగించారు. అయితే ఈ రోజుతో మళ్ళీ గడువు ముగియనుండటంతో చాలా మంది టాక్స్‌ పేయర్స్‌ ఈ-ఫైలింగ్‌ చేస్తుండటంతో ఈ వెబ్‌సైట్‌కు  ట్రాఫిక్‌  అమాంతంగా పెరిగిపోయింది. ఇక ఐటీఆర్ ఫైలింగ్‌కు ఆధార్‌ లింక్‌ చేయటం వల్లకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. దీంతో ఆగష్టు నెలాఖరులోగా ఆధార్‌తో అనుసంధానం పూర్తి చేసుకోవాలని ఐటీ శాఖ తెలిపింది.  ఆధార్, పాన్‌ లింక్‌ చేస్తేనే రిటర్న్స్‌ ప్రక్రియ పూర్తవుతుందని ఐటీ శాఖ అంటోంది.. వార్షికంగా రూ.5 లక్షలకన్నా తక్కువ ఆదాయం ఉన్నవారు, లేదా 80 ఏళ్ళు పైబడినవారు మినహా మిగిలిన వ్యక్తులకు ఐటీఆర్‌ ఈ–ఫైలింగ్‌ తప్పనిసరి.
 Most Popular