చిల్డ్రన్ ఇన్సూరెన్స్ ప్లాన్స్... కరెక్టేనా?

చిల్డ్రన్ ఇన్సూరెన్స్ ప్లాన్స్... కరెక్టేనా?


చిన్నారుల కోసం బీమా పాలసీలు.. జనాలను ఎంతో ఎమోషనల్‌గా కనెక్ట్ చేసే ప్రొడక్ట్ ఇది. పిల్లల కోసం పెట్టుబడులు చేయడం అనే విషయాన్ని, కాదనేందుకు ఎవరూ సాహసించలేరు. అయితే ఈ పాలసీలు నిజంగా వారికి ఆర్థిక భద్రత కల్పిస్తాయా? ఓసారి తరచి చూడాల్సిందే.

చైల్డ్ పాలసీల్లో ఎన్ని రకాలున్నాయ్?
చాలా వరకు ఇన్సూరెన్స్ పాలసీలు అన్నీ వారి చదువు, పెళ్లితో ముడి పెట్టే ఉంటాయి. 
వాస్తవంగా చూస్తే, ఈ ట్రెడిషనల్, యూనిట్ లింక్డ్ పాలసీలుగా ఇవి అందుబాటులో ఉన్నాయి. ట్రెడిషనల్ పాలసీలలోనే మెచ్యూరిటీ సమయంలో మీరు ఒకేసారి భారీ మొత్తాన్ని పొందే రకం కూడా ఉంటాయి. వీటిని ఎండోమెంట్ పాలసీలుగా చెబుతారు. నిర్ణీత అంతరాలలో నిర్ణయించిన మొత్తాలను చెల్లిస్తూ, బోనస్‌ను మాత్రం మెచ్యూరిటీ సమయంలో చెల్లించేవి మనీబ్యాక్ పాలసీలు. పిల్లల జీవితంలో వారికి కీలకమైన అవసర సమయాల్లో కొంత మొత్తం చేతికి అందేలా వీటిని డిజైన్ చేశారు. బోనస్‌లు, బీమా సంస్థ ప్రకటించిన లాయల్టీ అడిషన్స్ రూపంలో ట్రెడిషనల్ పాలసీలలో రిటర్న్స్ లభిస్తాయి.

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌.. మార్కెట్‌తో అనుసంధానం అయి ఉంటాయి. మీ ప్రీమియంలను ఎలా పెట్టుబడి చేయాలనే అంశాన్ని యూలిప్‌లలో నిర్ణయించుకోవచ్చు. ఈక్విటీ, డెట్.. వీటి కాంబినేషన్లలో మీ పెట్టుబడులు చేయవచ్చు. మీరు భద్రత ఎక్కువ కోరుకుంటే, హై డెట్ సాధనాలను ఎంచుకోవాలి, అలాగే కొంత రిస్క్‌కు సిద్ధపడినట్లయితే, ఈక్విటీ వైపు ఎక్కువ భాగం కేటాయించవచ్చు. ఈ పెట్టుబడులు ఎలా పెర్ఫామ్ చేశాయనే అంశంపై మీ రాబడులు ఆధారపడి ఉంటాయి. 

ఈ పాలసీలలో చిన్నారికి కానీ, పేరెంట్‌కు కానీ జీవిత బీమా అమలవుతుంది. సహజంగా పేరెంట్‌ జీవితాన్ని కవర్ చేసే పాలసీలలో, ప్రీమియం మినహాయింపు వంటి పలు రకాల రైడర్స్ అందుబాటులో ఉంటాయి. ఒకవేళ జీవిత బీమా అమలులో ఉన్న పేరెంట్ మరణించినట్లు అయితే, ఆ తర్వాతి కాలంలో ప్రీమియం చెల్లింపుల నుంచి మినహాయింపు లభిస్తుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారమే వీటిలో మెచ్యూరిటీ ప్రయోజనాలు అమలవుతాయి.

ఆర్థిక భద్రత రూపంలో చిన్నారికి ఏం కావాలంటే:
పిల్లలకు ఆర్థిక భద్రత కోసం ఈ మూడు అంశాలు తప్పనిసరిగా కవర్ కావాలి:

  1. పేరెంట్స్ ఆదాయం లేకపోయినా సరే రోజువారీ అవసరాలను కూడా తీర్చగలిగేలా ఉండాలి
  2. విద్య, వివాహం వంటి ప్రధానమైన లక్ష్యాలకు కూడా సహాయపడాలి
  3. తగినంతగా ఆరోగ్య బీమా అమలు కావాలి

పై అవసరాలను పరిశీలించినట్లయితే, ఆదాయం సంపాదించే పేరెంట్‌కే బీమా ఎక్కువగా అవసరం, చిన్నారికి కాదనే విషయం అర్ధమవుతుంది. జీవిత బీమా అవసరం పిల్లలకు దాదాపుగా లేనట్లే. చిల్డ్రన్ పాలసీల విషయంలో ప్రీమియం మినహాయింపు అనే అంశంపై అనేక వాదనలు ఇంకా జరుగుతున్నాయి. ఒక లీడింగ్ బీమా సంస్థ అందిస్తున్న చిల్డ్రన్ పాలసీ, సాధారణ టెర్మ్ ప్లాన్‌‌లను పోల్చి చూద్దాం. 

హై వాల్యూ టెర్మ్ ప్లాన్ ఎంతో తేలికైన విషయం అనే సంగతి అర్ధమవుతుంది. ఒకవేళ ఆదాయం సంపాదించే వ్యక్తి మరణం పాలయినా.. టెర్మ్ ప్లాన్ పాలసీలో అందే మొత్తం కచ్చితంగా పైన చెప్పిన అవసరాలను, ఇతర బాధ్యతలను తీర్చేందుకు సరిపోతుంది. అప్పటికే ఉన్న రుణాలను తీర్చేయడం, కుటుంబ అవసరాలను తీర్చేందుకు తగిన మొత్తం లభిస్తుంది. తక్కువ ఖర్చులో ఎక్కువ విలువతో లభించే టెర్మ్ కవర్ పాలసీలో, ప్రీమియం మినహాయింపు వంటి వాటితో అసలు సంబంధం ఉండదు.

 

మీరేం చేయచ్చంటే?
బీమా రూపంలో లభించే మొత్తం కంటే, అవసరాల ఆధారింగా లెక్కించే ఐచ్ఛికాన్ని ఎంచుకోవచ్చు. జీవితంలో రోజు వారీ ఖర్చులు, చిన్నారులు- జీవిత భాగస్వామి - ఇతర ఆధారపడిన వ్యక్తులతో సహా కుటుంబ సభ్యుల జీవిత లక్ష్యాలకు సరిపడేంతగా టెర్మ్ కవర్ ఎంచుకోవాలి. ఇప్పటికే ఉన్న బీమా, ఇతర ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు, ఇప్పటికే ఉన్న ఆస్తులను ఆర్థిక లక్ష్యాలు, ద్రవ్యోల్బణం, ట్యాకేషన్ ఆధారంగా అవసరాల ఆధారిత లెక్కింపునకు ఉపయోగించాలి. ఇది మీకు ఎంత కవర్ ఉండాలనే అంశంపై వాస్తవ చిత్రాన్ని అందిస్తుంది.

ఒకసారి బీమా ఉత్పత్తిని కొనుగోలు చేసిన తర్వాత, మీ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా తగిన ఆర్థిక సాధనాలలో పెట్టుబడులు చేయడం మీరు ఆస్తులను ఏర్పాటు చేసుకునే ప్రక్రియ ప్రారంభించవచ్చు. పెట్టుబడులలో డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో నిర్మాణం ద్వారా మీ చిన్నారుల లక్ష్యాలను అందుకునేందుకు తగిన ప్రణాళికలు రూపొందించవచ్చు.

ఇప్పటికే ఇలాంటి పాలసీలు ఉంటే ఏం చేయాలి?
అనేక సందర్భాలలో ఇప్పటికే ఇలాంటి చిల్డ్రన్ పాలసీలు తీసుకున్న వ్యక్తులు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటారు. ఇవి తీసుకోవడం తప్పిదమే అని తెలిసినా, ఇలాంటి పాలసీల నుంచి బయటకు రావడం చాలా కష్టమైన విషయం. ఈ పాలసీలపై తగిన నిర్ణయం తీసుకునేందుకు, ఈ ప్రీమియంలను చెల్లించేందుకు మీ నగదు లభ్యత ఎలా ఉందనే అంశాన్ని పరిశీలించాలి. మీ జీవిత లక్ష్యాల కోసం ప్రణాళికలు రచించేందుకు, తగినంతగా నగదు లభ్యత మీ దగ్గర ఉన్నట్లయితే, మీరు వీటిని నిరభ్యంతరంగా కనసాగించవచ్చు.

ఒక వేళ ప్రీమియంలు ఎక్కువగా ఉండడంతో, మీ లక్ష్యాలను అందుకునేందుకు ఇవి అడ్డుపడుతున్నాయనే భావన కలిగితే మాత్రం, నష్టం వచ్చినా సరే వీటిని సరెండర్ చేసేందుకే ప్రాధాన్యత ఇవ్వాలి. చెల్లించినంత వరకూ ప్రీమియంలను పెయిడ్అప్‌గా వదిలేసి, భవిష్యత్తు ప్రీమియంలను చెల్లించడం నిలిపివేసే ఐచ్ఛికం కూడా మీకు ఉంటుంది. సరెండర్ విలువ నిబంధనలు/నిలిపివేత నిబంధనలను పరిశీలిస్తే, ఈ ఇన్సూరెన్స్ పాలసీలపై తగిన నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. పెనాల్టీలను పరిశీలించి, ఈ తరహా పాలసీల నుంచి బయటపడేందుకు సరైన సమయాన్ని ఎంచుకోవచ్చు.

క్లుప్తంగా చెప్పాలంటే, చైల్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు మీ పిల్లల ఆర్థిక భద్రత కోసం ఎలాంటి అదనపు ప్రయోజనాలను కల్పించలేవు. బీమా, పెట్టుబడి.. రెండింటినీ కవర్ చేసేటట్లుగా మీ అవసరాలకు తగిన ఉత్పత్తులను ఎంచుకోవాలి. టెర్మ్ కవర్, మ్యూచువల్ ఫండ్స్ వంటి సాధారణ పెట్టుబడుల కాంబినేషన్ ద్వారా, మీ పిల్లల ఆర్థిక అవసరాలకు తగిన అవకాశాలను కల్పించవచ్చు.
 Most Popular