ఏటీఎంలు, యాప్స్ ద్వారా రుణాలు?!

ఏటీఎంలు, యాప్స్ ద్వారా రుణాలు?!

ఏటీఎంలు, ఆన్‌లైన్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఇప్పటికే బడా ప్రైవేటు బ్యాంకులు పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ తరహా సర్వీసులను ఆఫర్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, ఫైనాన్షియల్ టెక్నాలజీ స్టార్టప్స్‌లు పర్సనల్ లోన్స్‌ పద్ధతులను సమూలంగా మార్చేసేస్తున్నాయి.

ప్రైవేటు రంగంలోని అతి పెద్ద బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్, తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ నిర్వహిస్తున్న కస్టమర్లకు ఏటీఎం ద్వారానే పర్సనల్ లోన్స్‌ను ఆఫర్ చేయడం తాజాగా ప్రారంభించింది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా ముందస్తుగా ఎంపిక చేసిన కస్టమర్లు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తోంది. అయితే, మీకు క్రెడిట్ హిస్టరీ లేకపోయినా, బ్యాంకుతో దీర్ఘకాలంగా అనుబంధం లేకపోయినా, మీరు ఎర్లీశాలరీ.కాం, లోన్‌ట్యాప్ వంటి స్టార్టప్స్‌ ద్వారా పర్సనల్ లోన్ పొందే అవకాశం ఉంది.

 

క్రెడిట్ ప్రొఫైల్ ఎలా పరిశీలిస్తారు?

స్టార్టప్‌ల లక్ష్యం ప్రధానంగా క్రెడిట్ హిస్టరీ లేని వ్యక్తులే అవుతోంది. కస్టమర్ ప్రొఫైల్‌ను పరిశీలించేందుకు ఇవి పలు రకాల ప్రమాణాలను పాటిస్తున్నాయి. దరఖాస్తుదారుని సోషల్ మీడియా అకౌంట్, ఆ అకౌంట్‌లోని ఫ్రెండ్స్ లిస్ట్, లొకేషన్ వంటి వాటిని పరిశీలిస్తున్నాయి. అలాగే కస్టమర్ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను పరిశీలించడం ద్వారా కూడా ఖర్చు చేసే అలవాట్లను పరిశీలిస్తున్నాయి. 

రుణ విధానం:

ఒక రోజు నుంచి ఒక నెల వరకు షార్ట్‌టెర్మ్‌ పర్సనల్ లోన్‌ను ఎర్లీశాలరీ.కాం ఆఫర్ చేస్తోంది. ఈ కంపెనీ యాప్‌లో లోన్ అప్లికేషన్‌ను పూర్తి చేసేందుకు సుమారుగా 5 నిమిషాలు పడుతుందంతే. కేవైసీ, దస్తావేజులపై సంతకాల తర్వాత.. కొన్ని గంటల్లోనే రుణ మంజూరు జరుగుతుంది. ఆ తర్వాత నుంచి అయితే, ఇలా రుణాన్ని జారీ చేయడం తక్షణమే జరుగుతుంది. “మా దగ్గర రుణం తీసుకుంటున్న వారిలో 35 శాతం మంది కొత్తగా లోన్‌కు దరఖాస్తు చేస్తున్నవారే,” అని ఎర్లీశాలరీ సీఈఓ & కో-ఫౌండర్ అక్షయ్ మెహ్రోత్రా చెబుతున్నారు

ఒక రోజు నుంచి 5 ఏళ్ల కాల వ్యవధికి రూ. 5 లక్షల రుణాన్ని లోన్‌ట్యాప్ ఆఫర్ చేస్తోంది. అయితే, వీరి రుణ విధానం క్రెడిట్ కార్డ్ మాదిరిగా పని చేస్తుంది. "మీరు కనీస మొత్తాన్ని అయినా, లేదా మొత్తం రుణాన్ని అయినా, వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది," అని లోన్‌ట్యాప్ సీఈఓ సత్యం కుమార్ చెబుతున్నారు. 

 

మధ్యవర్తులు కూడా:

క్యుబెరా.కాం, పేసెన్స్ వంటి మధ్యవర్తిత్వం వహించే కంపెనీలు కూడా ఉన్నాయి. ఆర్‌బీఎల్ బ్యాంక్‌తో క్యుబెరా జట్టు కడితే, ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్‌తో పేసెన్స్ కలిసి పనిచేస్తోంది. ఈ ఫిన్‌టెక్ స్టార్టప్స్ తమ భాగస్వామ్య రుణదాతల కోసం రుణాలను నిర్వహిస్తాయి. ఎగవేతల విషయంలో కూడా ఇవి రిస్క్ భరిస్తాయి. "మేము చేస్తున్నట్లుగానే ఆయా కంపెనీలు కూడా రుణాలను మంజూరు చేయడం సైద్ధాంతికంగా సాధ్యమే. అయితే అది వాటికి గిట్టుబాటు కాదు. ఆయా సంస్థలు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో నెమ్మదిగా ఉంటాయి. అలాగే, చిన్నపాటి రుణాలు ఇవ్వడంలో రుణదాతలకు నిర్వహణ ఖర్చులు కూడా ఎక్కువ," అని క్యుబెరా సీఈఓ & ఫౌండర్ ఆదిత్య కుమార్ చెబుతున్నారు.

బ్యాంక్ కస్టమర్లతో పాటు ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేని వారికి కూడా క్యుబెరా, పేసెన్స్‌లు సేవలు అందిస్తాయి. “మొదటగా మా దగ్గర రుణం తీసుకుని రిలేషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత, మరుసటి సారి నుంచి మాత్రం రుణాలను తక్షణమే మంజూరు చేస్తాం,” అని పేసెన్స్ కౌ-ఫౌండర్ & సీఓఓ సయాలి కరన్జ్ కుమార్ తెలిపారు.

 

ఫైనాన్షియల్ ప్లానర్స్ ఏమంటున్నారంటే:

పర్సనల్ లోన్స్ పొందడం ఇప్పుడు సులభం కావడంతో, ఇలాంటి మనీ ట్రాప్‌లో పడకూడదని ఫైనాన్షియల్ ప్లానర్స్ చెబుతున్నారు. ఒకవేళ డీఫాల్ట్ అయితే మాత్రం, ఈ సంస్థలు క్రెడిట్ బ్యూరోలకు సమాచారం ఇస్తాయి. అలాంటి సమయంలో హౌసింగ్‌లోన్‌ పొందడం కస్టమర్‌కు కష్టం అయిపోతుందని అంటున్నారు. 
 
ఈ సదుపాయాలు పొందడం సౌకర్యంగా ఉన్నా, అత్యవసర సమయంలో మాత్రమే ఇలాంటి రుణాలు పొందాలి. రోజువారీ ఖర్చుల కోసం వీటిని తీసుకోవడం సరికాదనే విషయాన్ని గుర్తించాలి. “ఖర్చులను నియంత్రించలేని సమయంలోనే ఆయా వ్యక్తులు ఫైనాన్షియల్‌గా డిజాస్టర్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకసారి ఇలాంటి ప్రొడక్ట్‌ను ఉపయోగించుకోవాల్సి వస్తే, ఆ తర్వాత దానినే అలవాటుగా చేసుకోకూడదు,” అని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మల్హర్ మజుందర్ చెబుతున్నారు.

రుణాలపై వడ్డీ రేట్లు
 

నెలకు వడ్డీ రేటు

(%)

గరిష్ట రుణ మొత్తం

(రూ. లక్షల్లో)

గరిష్ట గడువు

(నెలల్లో)

ఎర్లీ శాలరీ 2 - 2.5 1 3
లోన్‌ట్యాప్ 1.5 10 36
పేసెన్స్ 1.4 - 2.8 2 24
క్యుబెరా 1 - 2.2 5 48

ఓవర్‌డ్రాఫ్ట్ మేలు:

మీకు ఏదైనా బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్నట్లయితే, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించడం. ఇది సహజంగా 14-19 శాతం వడ్డీ రేటుతో లభిస్తుంది. ఒకసారి ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఏడాదిలోపు అత్యవసర సమయాల్లో ఈ ఓవర్‌ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఉపయోగించునే సౌలభ్యం ఉంటుంది.
 Most Popular