జొమేటో లిస్టింగ్ రేపేనా..? గాసిప్ రాయుళ్ల ప్రచారంలో నిజముందా..?

2021-07-22 08:33:07 By Anveshi

img

ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో చాలా మంది జొమేటో లిస్టింగ్ కోసం ఎదురు చూస్తుండగా, వచ్చే వారం కాదు ఈ వారమే అది కూడా  రేపే లిస్ట్ అవుతాయంటూ ప్రచారం సాగుతోంది. జొమేటో సంస్థ ఇన్‌సైడ్ పీపుల్‌తో క్లోజ్‌గా రిలేషన్స్ ఉన్న కొంతమందికి ఇది  అనధికారికంగా లీక్ అవుతుందంటూ గాసిప్స్ గత రాత్రి నుంచి గుప్పుమన్నాయ్.

 

ఎకనమిక్ టైమ్స్ కూడా ఈ ప్రచారాన్ని కథనం రూపంలో ప్రచురించింది. తమకి ఈ లిస్టింగ్ వ్యవహారంతో బాగా క్లోజ్ కాంటాక్ట్స్,  సోర్స్ కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు చెప్పారనేది ఈటీ వాదన. ఇప్పటికీ చాలా ప్రాసెస్ మిగిలి ఉన్నా కూడా వీలైతే  శుక్రవారమే
జొమేటో ఐపిఓ లిస్ట్ అవుతుందంటూ వారు చెప్పారట.

 

జులై 14-16 మధ్య ఇష్యూ ప్రారంభం కాగా, 11ఏళ్ల కేపిటల్ మార్కెట్ హిస్టరీలో లేనంతగా ఫస్ట్ న్యూఏజ్ ఇంటర్నెట్  స్టార్టప్‌గా ఈ ఐపిఓ రికార్డు క్రియేట్ చేయనుంది. ఒక రూపాయి ఫేస్ వేల్యూతో రూ.76 ఇష్యూ ప్రైస్ ఫిక్స్ చేసిన జొమేటో నిజంగా రేపు లిస్టైతే..అదో వండర్ అనే చెప్పాలి

 


zomato ipo listing July 23 July 27 ET