డీసెంట్ ఓపెనింగ్..! జీ ఎంటర్టైన్‌మెంట్‌కి అప్పరప్పర తాండ్ర..! 20శాతం దాటిన లాభం

2021-09-14 10:13:13 By Anveshi

img

స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హై పాయింట్ల మార్క్‌ను మంగళవారం మరోసారి సవరించాయ్. నిఫ్టీ 17438 పాయింట్లకు పెరగగా, సెన్సెక్స్ 58482 పాయింట్లకు పెరిగింది. ఇంట్రాడేలో 300 పాయింట్లకి పైగా పెరిగిన సెన్సెక్స్ తర్వాత ఓ 200 పాయింట్లకు అటూ ఇటూగా ట్రేడవుతోంది

 

ఒక్క ఎఫ్ఎస్జి సెక్టార్ మినహా అన్ని రంగాల షేర్లూ మ్ంచి లాభాల్లో ట్రేడవుతున్నాయ్.  బ్యాంక్ నిఫ్టీ, ఐటీ, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ‌లో కొనుగోళ్ల సందడి చోటు చేసుకుంది

 

ఉదయం ఎర్లీ గెయినర్లను చూస్తే, అదానీ పోర్ట్స్, ఐఓసి, ఐషర్ మోటర్స్, బ్రిటానియా, దివీస్ ల్యాబ్స్ 2 నుంచి1.16శాతం వరకూ లాభపడ్డాయ్. లూజర్లను చూస్తే, హెచ్‌యుఎల్, హిందాల్కో,హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్ 066శాతం నుంచి 0.22శాతం వరకూ నష్టపోయాయ్

 

మరోవైపు పునీత్ గోయెంకా నుంచి బోర్డ్ నుంచి ఊస్ట్ చేసేందుకు షేర్ హోల్డర్లు అప్రూవ్ చేయడంతో జీఎంటర్ టైన్మెంట్ షేర్లు ఇవాళ కదం తొక్కాయ్, ఏకంగా 20శాతం వరకూ షేర్లు లాభపడి అప్పర్ సర్క్యూట్ లాక్ చేశాయ్


రూ.232.90 దగ్గర భారీగా షేర్లు చేతులు మారగా, తర్వాత లాక్ ఊడి రూ.224.95 వద్ద కూడా ట్రేడవుతోంది. ఏకంగా 6 కోట్లకి పైగా షేర్లు ట్రేవడడం చూస్తుంటే మొత్తానికి ఇవాళ ఈ కౌంటర్‌ ర్యాలీనే ఫోకస్‌లో ఉండేలా సిచ్యుయేషన్ ఉంది


zeel trade puneeth goenka uc trade nifty

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending