కిందకు పడినా మెప్పించిన విప్రో.! అంచనాలను మించిన కాన్‌స్టంట్ కరెన్సీ గ్రోత్ ! Q2లో రూ.2930కోట్ల లాభం

2021-10-13 16:19:23 By Anveshi

img

దేశంలో మూడో అతి పెద్ద ఐటీ కంపెనీ విప్రో 2022 ఆర్ధిక సంవత్సరానికి క్యు2లో విడుదల చేసిన ఆర్ధిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయ్. తాజా త్రైమాసికమైన జులై-సెప్టెంబర్‌ మధ్య కాలం నికరలాభం రూ.2930కోట్లకి పరిమితమైంది. దీంతో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్‌లో చూస్తే జూన్ క్వార్టర్‌లో రూ.3242.6 కోట్ల లాభం గడించగా, నేడది దాదాపు 9 శాతం క్షీణించినట్లైంది. ఐతే తగ్గుదల అనేది మార్జిన్లు తగ్గడంతోపాటు, జీతాల పెంపు, క్యాప్‌కో సంస్థ కొనుగోలుతో చోటు చేసుకున్న పరిణామంగా చూడాల్సి ఉంది.


ఐతే ఐటి రెవెన్యూ మాత్రం రూ.19760.7కోట్లకి పెరిగింది. జూన్ క్వార్టర్‌లో నమోదైన రూ.18252.4 కోట్లతో పోల్చితే ఇది కాస్త స్వల్ప పెరుగుదల. కాన్‌స్టంట్ కరెన్సీ గైడెన్స్ చూస్తే డిసెంబర్ క్వార్టర్‌లో  2-4శాతం వృద్ధి నమోదు అవుతుందని విప్రో ప్రకటించింది.


డాలర్ టర్మ్స్‌లో సీక్వెన్షియల్ రెవెన్యూ గ్రోత్ 6.9శాతం లాభంతో 2.58 బిలియన్ డాలర్లుగా ఆదాయం ఆర్జించింది విప్రో. FY22Q2లో  విప్రో కాన్‌స్టంట్ కరెన్సీ గ్రోత్ ఏకంగా 8.1శాతంగా నమోదు కావడం విశేషం. ఇది ఇండస్ట్రీ 5నుంచి 7శాతం మధ్యలో ఉండొచ్చని అంచనా వేసింది.దీంతో ఈ ఫలితాలు అంచనాలను మించినవిగా కొందరు వర్ణిస్తున్నారు


ఈ ఏప్రిల్‌లోనే  విప్రో, లండన్ బేస్డ్ క్యాప్‌కో కంపెనీని 1.45 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ప్రక్రియ ఇప్పుడు పూర్తి కాగా, క్యాప్‌కో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ సర్వీస్ స్పేస్‌లో అతి పెద్ద కన్సల్టెన్సీ. ఈ డీల్  విప్రో చరిత్రలోనే అతి పెద్దది.

 

ఈ రోజు మార్కెట్లలో విప్రో షేరు 2శాతం లాభపడి రూ.672.60 వద్ద ముగిసింది


WIPRO RESULTS Q2 CAPCO

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending