వెయ్యి, రెండు వేలు కూడా రియాల్టీలో పెట్టుబడి చేయచ్చా?

2021-03-03 09:30:04 By Y Kalyani

img

REITsలో పెట్టుబడి కూడా స్థిరాస్తిలో పెట్టినట్టేనా?
స్టాక్ మార్కెట్లో ఓ మంచి ఆప్షన్

భారతీయులకు సంప్రదాయంగా వస్తున్న పెట్టుబడి సాధనాలు బంగారం, రియల్ ఎస్టేట్. రియాల్టీలో పెట్టినోళ్లు ఎవరూ నష్టపోలేదన్న సామెత ఉందిగా.. ధరలు పెరగడమే కానీ.. తగ్గడం ఉండదని ఎక్కువమంది భూమిపైనా, రియల్ ఎస్టేట్ పైనా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే భూమి ధరలు పెరుగుతాయి.. కానీ ఇందులో ఓ చిన్న సమస్య కూడా ఉంది. మనకు డబ్బులు అవసరం అనుకుంటే వెంటనే అమ్ముకునే వెసులుబాటు ఉండదు.. దీనికి తోడు దీనిపై పెద్దగా ఆదాయం కూడా ఉండదు. ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే అది ఖచ్చితంగా నిరర్థక ఆస్తి కింద లెక్కే.. అయితే దీనికే మంచి పరిష్కారం ఇప్పుడు REITs. అవును ఇది సంపద విలువ పెంచుతుంది.. కాకపోతే అక్కడ భూమిపై పెడతాం.. ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం.

పెరుగుతున్న ఇన్వెస్టర్లు...
గత దశాబ్ధకాలంగా ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్ ట్రస్ట్ REITలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇటీవల మనదేశంలో కూడా కమర్శియల్ స్పేస్, వేర్ హౌసింగ్ రియాల్టీ కంపెనీల ప్రైమరీ మార్కెట్లోకి వచ్చి సూపర్ హిట్ కొట్టాయి. ఎంబసీ ఆఫీస్ పార్క్స్, రహేజా ఆఫీస్ పార్క్స్ వంటివి దేశీయ మార్కెట్లోకి వచ్చాయి. 

ఎలా పనిచేస్తుందంటే..
REITలు మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే నిధులు సమీకరించి రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యంగా ఆఫీస్ స్పేస్ విభాగంలో ఆస్తులు నిర్వహిస్తాయి. ఇందులో మీరు కూడా స్టాక్ మార్కెట్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రాపర్టీ రిస్క్ లేకుండా మంచి  ప్రాఫిట్స్ ఇస్తుంది. అసెట్ వాల్యూ పెరుగుతుంది.. కంపెనీ పేరుతో ఆస్తులు ఉంటాయి కాబట్టి.. ఫండమెంటల్ గా వాటికి బలం ఉంటుంది. ఇది సహజంగానే షేర్లు పెంచడానికి దోహదపడుతుంది. రియాల్టీలో అయితే భూమిపై నేరుగా డబ్బు పెడతాం.. ఇక్కడ పెడితే రియాల్టీలోనే లిక్విడ్ రూపంలో మన సంపద ఉంటుంది. అవసరం అయితే వెంటనే క్యాష్ చేసుకోవచ్చు. కానీ రియాల్టీలో నేరుగా పెడితే అవకాశం ఉండదు.

 

రియాల్టీలో పెట్టుబడి పెట్టడం అంటే లక్షల కొద్దీ సొమ్ము కావాలని అనుకుంటాం. కానీ REITsలో అయితే.. చిన్న మొత్తాలను కూడా ఇన్వెస్ట్ చేసి, రియాల్టీలో అందే లాభాలను అందుకోవచ్చు. 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending