అసలు సిసలు మల్టీ బ్యాగరీ స్పెషాల్టీ స్టీల్ కంపెనీ ..!టేకాఫ్‌కి రెడీగా ఉందంటూ ఊరింపు

2021-10-22 12:47:59 By Anveshi

img

మార్కెట్లలో  ఎన్ని స్టాక్స్ కొన్నా మల్టీబ్యాగర్ దాహం అనేది తీరదు. అసలు ఇప్పుడున్న బుల్ ర్యాలీలో ఏ స్టాక్ చూసినా..అబ్బ భలే షేరు కొంటే బావుండనే ఆత్రం పెరిగిపోతుంటుంది. ఇలా కొంటూ పోతే కొన్నాళ్లకి ఆ పోర్ట్ ఫోలియో తిరగేయాలన్నా కూడా సమయం సరిపోనన్ని స్టాక్స్ ఉన్నాయ్.  ఇలాంటి తరుణంలో  వెంచురా సెక్యూరిటీస్‌కి చెందిన రీసెర్చ్ హెడ్ వినీత్ బోలింజ్కర్ అనే అనలిస్టు  బ్రహ్మాండంగా లాభాలను పంచుతుందని, మల్టీ బ్యాగర్ అవడానికి సిద్ధంగా ఉన్నాయంటూ సూచిస్తున్నారు

 

 వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్ లిమిటెడ్
ఈ స్టాక్ మిడ్‌క్యాప్ సెగ్మెంట్‌లోది. ప్రస్తుతం రూ.259.55 వద్ద ట్రేడ్ అవుతోంది

 

ఈ మధ్యనే ఐచీ స్టీల్ కంపెనీతో స్పెషల్ స్టీల్ ప్రొడక్ట్స్ సప్లై చేసేందుకు వర్ధమాన్ స్టీల్ ఒప్పందం కుదర్చుకుంది. ఈ ఐచీ స్టీల్, టయోటాకి చెందిన సబ్సిడరీ సంస్థ. టయోటా కంపెనీకి ప్రత్యేక రకపు స్టీల్ ఉత్పత్తులు సరఫరా చేసే ఏకైక సంస్థ వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్. ఈ ఒప్పందంతో వర్ధమాన్ స్టీల్ సంస్థ ప్రపంచ విపణిలోకి ప్రవేశించేందుకు ద్వారాలు తెరుచుకున్నాయని, వినీత్ చెప్తున్నారు

 

చైనా ప్లస్ పాలసీ, స్క్రాపేజీ పాలసీలను కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే, ఈ స్టాక్ మంచి అవకాశం కలిగి ఉంది. అలానే ఇక అందరూ ఎలక్ట్రిక్ వాహనాలవైపు మళ్లక తప్పని స్థితిని కలగజేస్తోన్న తరుణంలో, ఆ రంగంలోనూ వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్ లాభదాయకం. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 44 కోట్ల లాభం ప్రకటించిన ఈ సంస్థ, 2024లో రూ.140 కోట్లకి దాన్ని చేర్చగలదని వినీత్ అంచనా వేసారు. అందులోనే 10లోపే పీఈ ఉన్న ఈ కంపెనీ స్టాక్, ఖచ్చితంగా అందరికి అందుబాటులో ఉన్న టేకాఫ్‌కి రెడీగా ఉన్న మల్టీబ్యాగర్‌గా వర్ణించారు

 

( పై స్టాక్‌ని వినీత్ బొలింజ్కర్ రికమండ్ చేశారు తప్ప ప్రాఫిట్ యువర్ ట్రేడ్ కాదు . లాభనష్టాలకు ఇన్వెస్టర్లదే బాధ్యత)

 


VARDHAMAN

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending