మధ్యాహ్నానికి మార్కెట్లలో విజయ రీసౌండ్..! ఇంట్రాడేలో రూ.110 ప్రాఫిట్! సెంటిమెంట్ మార్క్ బ్రేక్ చేస్తుందా..?

2021-09-14 13:13:49 By Anveshi

img

ఇవాళ లిస్టైన విజయా డయాగ్నోస్టిక్స్  ఐపిఓ టార్గెట్ అచ్చీవ్ అయినట్లే కన్పిస్తోంది. ఉదయం అంతంత మాత్రంగానే లాభపడిన ఈ షేర్లు 12 గంటలకల్లా గేర్ మార్చి రూ.635.80ని తాకాయ్. దీంతో ఇంట్రాడేలో 110 రూపాయల లాభం పంచినట్లైంది. అలానే ఇష్యూ లిస్టైన రోజు మంచి లాభం పంచిన స్టాక్స్ లిస్ట్‌లో చేరిపోయింది

 

విజయా డయాగ్నోస్టిక్స్ ఇష్యూ ప్రైస్ రూ.531 కాగా, ఇన్వెస్టర్ల ఆదరణ 4 రెట్లు లభించగా, వాటిలో క్వాలిఫైడ్ ఇన్సిట్యూషనల్ బయింగ్ సపోర్ట్ బాగా కన్పించింది. క్యుఐబి పోర్షన్ 13 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.దీంతో షేరులోని అసలు వేల్యూ తెలుసుకున్నారు కనుకే, ఓపెనింగ్ డస్ట్ చల్లారిన తర్వాత, ట్రేడర్లు ఇంకాస్త దుమ్ము రేపుతున్నారంటున్నారు. షేరు ధర సెంటిమెంట్ మార్క్ అయిన రూ.650 వద్ద చాలా ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వన్స్ ఆ రేటు కూడా క్రాస్ అయిందంటే, ఇక షేరుని పట్టుకోలేమని పంటర్లు అంచనా వేస్తున్నారు

 

సౌతిండియాలో ఫేమస్ డయాగ్నోస్టిక్ సర్వీస్ సెంటర్లలో ఒకటైన విజయ డయాగ్నోస్టిక్స్  పాథాలజీ, రేడియాలజీ, సర్వీసులు అందిస్తోంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సెంటర్ల ఉనికి ఎక్కువ. 

 

దేశంలోని డయాగ్నోస్టిక్ సర్వీసుల మార్కెట్ రూ.71 వేల కోట్ల నుంచి రూ.73వేల కోట్ల వరకూ ఉంటుందని క్రిసిల్ అంచనా.  రాబోయే రెండేళ్లలో ఇది 92వేల కోట్లకు పెరుగుతుందని ,  ఈ మార్కెట్ నుంచి ఎవరు ఎక్కువ వీలైనంత వాటా రాబట్టుకుంటే వారిదే రాబడి అంటూ క్రిసిల్ రిపోర్ట్ చెప్తోంది. విజయా డయాగ్నోస్టిక్స్  వచ్చే రెండేళ్లలో రూ.12వేల కోట్ల నుంచి 13వేల కోట్ల రూపాయల ఆదాయం గడిస్తుందని కూడా ఆ రిపోర్ట్‌లో చెప్పింది

 

ప్రస్తుతం విజయా డయాగ్నోస్టిక్స్ షేరు  రూ.610.30 వద్ద ట్రేడవుతోంది.

 


VIJAYA DIAGNOSTICS IPO LISTING GAINS

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending