భారత్ ను హెచ్చరించిన అమెరికా.. కష్టమేనట

2021-05-05 09:08:33 By Y Kalyani

img

భారత్ ను హెచ్చరించిన అమెరికా.. కష్టమేనట

ఇండియాలో కరోనా ఆందోళనకర స్థాయిలో ఉందని హెచ్చరించింది అమెరికా. ఈ దేశానికి చెందిన ఎపిడిమాలజిస్ట్ చీఫ్ డాక్టర్‌ ఆంథోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాప్తిని అడ్డుకునేందుకు తక్షణమే తాత్కాలిక కోవిడ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే సైన్యాన్ని కూడా రంగంలోకి దించాలన్నారు. కేవలం వైద్య సామగ్రి అందించడమే కాదు, వైద్య సిబ్బందిని కూడా భారత్‌కు పంపించాలని ఇతర దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. భారత్‌లో కోవిడ్‌ కేసులు మూడు నెలల్లోనే రెట్టింపయ్యాయి. 2.20 లక్షల మంది ప్రాణాలుకోల్పోయారు.
అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలెర్జీ, ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ డైరెక్టర్, అధ్యక్షుడు జో బైడెన్‌కు చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌ అయిన డాక్టర్‌ ఫౌచీ పలు హెచ్చరికలు చేశారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇన్ఫెక్షన్‌ వ్యాప్తిని నిలువరించేందుకు భారత్‌లో కొన్ని వారాలపాటైనా లాక్‌డౌన్‌ విధించడం మేలన్నారు.
కోవిడ్‌ వ్యాప్తి తీవ్రతతో భారత్‌ చాలా ఒత్తిడిలో ఉంది. భారత్‌లో కోవిడ్‌ చికిత్సలో ఉపయోగించే వైద్య సామగ్రి కొరత ఉన్న దృష్ట్యా ప్రపంచ దేశాలు అవసరమైన ఆ సామగ్రిని అందజేయాలి. దీంతోపాటు వైద్య సిబ్బందిని కూడా పంపించాలని సలహా ఇచ్చారు. భారత్‌లో అభివృద్ధి పరిచిన రెండు టీకాలతోపాటు, అమెరికా, రష్యాతోపాటు ఇందుకోసం ముందుకు వచ్చే మరే ఇతర దేశాలకు చెందిన సంస్థలే కూడా టీకాలను సేకరించి సాధ్యమైనంత మందికి ఇవ్వడం తక్షణం ప్రారంభించాలంటున్నారు. 


corona lockdown covid curfew

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending