మంచి కాఫీలాంటి స్టాక్స్ ఇవి! ట్రేడింగ్ కోసం మాత్రమే !

2021-03-03 08:06:24 By Anveshi

img

నిఫ్టీ 14700 రేంజ్ దాటి సస్టెయిన్ అవడంతో ట్రేడర్లు స్టాక్ స్పెసిఫిక్ స్ట్రాటజీకి కట్టుబడి ఉండాలి. గత రెండు సెషన్లలో బుల్స్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ చేయడంతో గత వారం నష్టాలను పూడ్చుకునే దిశగా నిఫ్టీ కదలికలు ప్రస్తుతానికి కన్పిస్తున్నాయ్. నిఫ్టీ 14,900ని షార్ట్ కవరింగ్ అండతో దాటేసింది. టెక్నికల్‌గా చూస్తే, నిఫ్టీ టెక్నికల్ ఫ్రంట్‌లో ఇండెక్స్ వీ షేప్ రికవరీ చూపించడమే కాకుండా 50డేస్ ఎక్స్‌పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్‌ని దాటి ట్రేడవుతోంది.

కొనండి : ఎల్ అండ్ టి టెక్నాలజీ సర్వీసెస్ I  ఎల్ టిపి రూ.2760I టార్గెట్ ప్రైస్ రూ.3105 I స్టాప్‌లాస్ రూ. 2500

గత కొద్ది రోజులుగా స్టాక్‌లో మంచి ర్యాలీ చోటు చేసుకుంది. రూ.1800 నుంచి రూ.2750కి వెళ్లిన తర్వాత ప్రాఫిట్  బుకింగ్ చోటు చేసుకుంది. దీంతో స్టాక్ తిరిగి రూ.2300 దగ్గరకు పడిపోయింది.50 రోజుల మూవింగ్ యావరేజ్‌ దగ్గర సపోర్ట్ తీసుకుంది. డైలీ ఛార్టులలో ఎల్ అండ్ టి టెక్నాలజీ సర్వీసెస్ రూ.2500 దాటేసి..తొందర్లోనే మరోసారి 3వేల మార్క్ దాటుతుందని అంచనా

కొనండి: నిప్పాన్ లైఫ్ ఇండియాI: ఎల్‌టిపి రూ.344.95 I టార్గెట్ ప్రైస్ రూ.386 I స్టాప్‌లాస్ రూ.315

స్టాక్‌లో మంచి మొమెంటమ్ కన్పిస్తోంది. చార్టులపై హయ్యర్ హైస్, బాటమ్ హైస్ ఫామ్ చేస్తోంది. షార్ట్‌టర్మ్, లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్‌లపైనే డైలీ,వీక్లీ ఛార్టులలో ట్రేడవుతోంది. ప్రస్తుత తరుణంలో నిప్పాన్ లైఫ్ ఇండియా  అసెట్ మేనేజ్ మెంట్ షేరులో ఫ్రెష్ బ్రేకవుట్ చోటు చేసుకుంది అది కూడా రూ.345పైన. ఇది ఆ స్టాక్‌కి సంబంధించిన ఫ్రెష్ హై.  చార్టులో అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటెర్న్ నమోదు చేసింది.

కొనండి: ఆర్తి ఇండస్ట్రీస్ I  ఎల్‌టిపి రూ.1298.25 Iటార్గెట్ ప్రైస్ రూ.1453 I స్టాప్‌లాస్ రూ.1180 

52వారాల హైని ఈ జనవరిలోనే తాకిన ఆర్తి ఇండస్ట్రీస్ రూ.1365.90ని తాకిన తర్వాత కొద్దిగా రూ.1125స్థాయికి పడిపోయింది. ప్రాఫిట్ బుకింగ్ హయ్యర్ లెవల్స్‌లో చోటు చేసుకోగా, ప్రస్తుతం తిరిగి  వీక్లీ ఇఁటర్వెల్స్‌లో 50డేస్ మూవింగ్ యావరేజ్‌పైన ట్రేడవుతూ..వీ షేప్ రికవరీ నమోదు చేసింది. 

( పై స్టాక్స్  గ్లోబల్ సెక్యూరిటీస్ కి చెందిన క్షితిజ్ గాంధీ రికమండేషన్స్, సైట్‌వి కావని గమనించగలరు)

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending