దంచి కొట్టిన 7 స్టాక్స్..! కొనుగోళ్ల ఊపుని అందిపుచ్చుకుంటూ లాభపడిన టాటా మోటర్స్ : 11శాతం ర్యాలీ

2022-05-13 13:11:13 By Anveshi

img

మార్కెట్లలో వారాంతంలో నిఫ్టీ తిరిగి 16వేల మార్క్ అందుకుంది. అలానే
అన్ని రంగాల షేర్లలో గత ముగింపుతో పోల్చితే లాభాల్లో ట్రేడవుతున్నాయ్. సెన్సెక్స్
725 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 230 పాయింట్ల వరకూ లాభపడింది

 

ఈ దశలో ఇవాళ్టి కొనుగోళ్ల ఊపును అందిపుచ్చుకుని, కొన్ని స్టాక్స్ భారీగా లాభపడ్డాయ్. 
వాటిలో టాటా గ్రూప్ స్టాక్స్ రెండు ఉన్నాయ్. టాటా మోటర్స్ ఇంట్రాడేలో ఇప్పటికే 11శాతం
వరకూ పెరిగి రూ.410 ధర దాటగా, టైటన్ కంపెనీ 5శాతం లాభపడింది

 

హీరో మోటోకార్ప్‌తో కలసి మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఆటో స్టాక్స్‌ ర్యాలీలో పార్టిసిపేట్ చేయగా, సన్‌ఫార్మా  ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి యాక్టివ్ గెయినర్‌గా ట్రేడవుతోంది

 

కోల్ ఇండియా, హిందుస్తాన్ యూనిలీవర్ కంపెనీల షేర్లు చెరో 4 శాతం పెరిగి మంచి ఊపు ప్రదర్శించాయ్


Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending