ఈ టాప్ 10 కంపెనీల లాభం అదిరిపోయింది..! ఒకటిన్నరలక్షల కోట్ల రూపాయలు పోగేసుకున్నాయ్ !

2021-09-26 12:35:06 By Anveshi

img

గత వారం బిఎస్ఈ 1032 పాయింట్లు పెరగగా, సెన్సెక్స్ 60వేల మార్క్ దాటిన సంగతి తెలిసిందే. మరి అందుకు తగ్గట్లే  టాప్ 10 వెయిటేజీ ఉన్న కంపెనీల మార్కెట్ కేపిటలైజేషన్ కూడా రూ.1,56,317.17కోట్ల రూపాయలను కొత్తగా జత చేర్చుకున్నాయ్. అంటే యావరేజ్‌న ఒక్కో కంపెనీ 15వేలకోట్ల రూపాయలకు పైగా సంపద పెంచుకున్నట్లే..!

 

 నంబర్ వన్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ తన మార్కెట్ కేపిటలైజేషన్‌కి రూ.58,671.55కోట్లని అధికంగా చేర్చుకుంది. అలా రూ.15,74,052.03కోట్లకి తన మార్కెట్ కేపిటలైజేషన్ చేరింది. ఐతే గురువారం ఏకంగా ఈ సంస్థ మార్కెట్ కేపిటలైజేషన్ 16లక్షల కోట్లు క్రాస్ అయింది

 

వేల్యేషన్ పరంగా తక్కువ ఉన్నా..ఇన్ఫోసిస్ సంస్థ ఈ వారం ఏకంగా రూ.30,605.08కోట్లను తన M-capకి అదనంగా చేర్చుకుని రూ.7,48,032.17 కోట్లకి ఎగసింది

బజాజ్ ఫైనాన్స్ M-cap రూ. 22,173.04 పెరిగి రూ.రూ. 4,70,465.58 కోట్లకి చేరింది 
టిసిఎస్ మార్కెట్ కేపిటలైజేషన్ రూ. 15,110.63 పెరిగి రూ. 14,32,013.76కోట్లకి చేరింది
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ M-cap రూ. 10,142 కోట్లు పెరిగి రూ. 8,86,739.86కోట్లకి చేరింది


ఇక టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ మార్కెట్ కేపిటలైజేషన్‌లో రూ.6,068.69 కోట్లు చేరి రూ.రూ.4,05,970.66కోట్లకి పెరిగింది.


హిందుస్తాన్ యూనీలీవర్ మార్కెట్ కేపిటలైజేష్ రూ.4,863.65 కోట్లు పెరిగి రూ. 6,44,199.18 కోట్లకి చేరింది


కోటక్ మహీంద్రా బ్యాంక్ వేల్యేషన్‌లోనూ అదనంగా రూ.  4,254.75 కోట్లు పెరిగి రూ. 4,01,978.75 కోట్లకి చేరింది.

అలానే హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్ కేపిటలైజేషన్ రూ.2,523.56 కోట్లు పెరిగి  రూ. 5,13,073.85కోట్లకి చేరింది
మరో ప్రవేట్ బ్యాంక్ ఐసిఐసిఐ మార్కెట్ కేపిటలైజేషన్ స్వల్పంగా రూ. 1,904.22 కోట్లు పెరిగి రూ.5,01,080.90కోట్లకి చేరింది


hdfc kotak mahindra icici hul reliance itc sbi bajajfinance infosys

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending