మళ్లీ తెరపైకి టైడ్ వాటర్ ఆయిల్..! 1:1 బోనస్, రూ.200 డివిడెండ్, స్టాక్ స్ప్లిట్..! ఒక్క రోజే ఇన్ని న్యూసా..!

2021-06-11 12:46:16 By Anveshi

img

లూబ్రికెంట్ ఆయిల్ కంపెనీ టైడ్‌వాటర్ మరోసారి రిపిల్స్ క్రియేట్ చేస్తోంది. శుక్రవారం మార్కెట్లలో ఈ స్టాక్ 5శాతం పెరిగింది. అప్పర్ సీల్ లాక్ చేసింది.రూ.11458 ధర దగ్గర బిగదీసిన ఈ సంస్థ షేర్లు జూన్ 7న రికార్డు ధరకి చేరింది. గత వారం ట్రేడింగ్‌లో రూ.12991కి ఎగసిన టైడ్ వాటర్ ఆయిల్ వన్ ఈష్టూ వన్ అంటే ఒకదానికి మరో షేరు బోనస్ ప్రకటించింది. అంతేకాదు ఒక్కో షేరుకు రూ.200 డివిడెండ్ కూడా ఇస్తోంది..అక్కడితో కథ అయిపోలేదు ఫేస్ వేల్యూ 5 నుంచి 2కి స్ప్లిట్ చేస్తోంది.

 

మే 26న టైడ్ వాటర్‌పై మన సైట్‌లోనే ఓ కథనం రాశాం. బోనస్ ఇష్యూ, స్టాక్ స్ప్రిట్ సమాచారం బైటికి రావడంతో అప్పడు కూడా బీభత్సంగా పెరిగిందీ షేరు. తర్వాత రికార్డు లెవల్ దగ్గర్నుంచి కరెక్ట్ అయినా సరే మరో 144శాతం ర్యాలీ చేసింది.

 

(చదవండి మా గత కథనం మార్కెట్లలో టైడ్ సునామీ! 20% అప్పర్ సర్క్యూట్ ! సింగిల్‌ డే Rs.1200 జంప్ )

 

 

జులై 27కి కంపెనీ తన అన్ని కార్పొరేట్ నిర్ణయాలకు రికార్డ్  డేట్‌గా ఫిక్స్ చేసింది. ఆలోపున డీమ్యాట్ అక్కౌంట్లలో ఉన్న ప్రతి ఒక్క షేరుకు తర్వాత రెండు షేర్లు వస్తాయి. అలానే ప్రతి షేరుకు రూ.200 డివిడెండ్ వస్తుంది. ఇక స్టాక్ స్ప్టిట్ అనేది ఒక షేరుకు రెండు షేర్లు అవుతాయి కానీ..ఇన్వెస్టర్ల దగ్గర ఎన్ని షేర్లుంటే వాటికి తగినట్లుగా విభజించబడి డీమ్యాట్ అక్కౌంట్లలో చేరతాయి.

 

ప్రస్తుతం ఎన్ఎస్ఈలో షేర్లు రూ.11471.60 వద్ద లాక్‌లోనే ఉన్నాయి. 15వేలకిపైగా పెండింగ్ ఆర్డర్లు కన్పిస్తున్నాయ్


tide water oil locks 20% upper circuit UC on board bonus stock split news nse bse issue telugu profit trade

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending