ఈ 8 ఐపిఓలు లిస్టింగ్ రోజున రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెట్టాయ్ ! 100% లిస్టింగ్ గెయిన్స్ తెచ్చాయ్-ఇంకా పెరుగుతూనే ఉన్నాయ్..!

2021-07-21 13:22:47 By Anveshi

img

స్టాక్ మార్కెట్లలో ఇప్పుడు ఎవరి నోట విన్నా కూడా వచ్చేవారం ఏ IPO రాబోతోంది..షేర్లు అలాట్ కావాలంటే ఏదైనా టెక్నిక్  ఉందా అని ఎంక్వైరీలు విన్పిస్తున్నాయ్. అలాంటివారి మొదటి ప్రశ్నకైతే..ప్రతి వారం ఓ కొత్త ఐపిఓ రాబోతోందనే సమాధానం  రెడీగా ఉంది. ఇక రెండో ప్రశ్నకి సమాధానం అలాట్‌మెంట్‌కి షార్ట్ కట్ ఏమీ లేదని చెప్పాలి..ఎవరైనా ఉద్యోగులకు కేటాయించిన షేర్లు ముందే మనకి విక్రయించడమో..లేదంటే గ్రే మార్కెట్లలో కొనుగోలు చేయడమో తప్పించి వేరే మార్గం లేదు !

 

ఇంత క్రేజ్ ఎందుకు ఐపిఓకి వస్తున్న కంపెనీలపై ఉందంటే, అవి పంచుతున్న లాభాలే, వంద రూపాయలు పెట్టి కొన్న షేరు..( అలాటైతే) లిస్టింగ్ రోజే వంద రూపాయల లాభం తెచ్చిపెడుతుంటే, ఇక అంతకంటే లాభం ఏముంది..? అది కూడా పెట్టుబడి  పది రోజులలోపే రెట్టింపు కావడమనేది ఈ ఐపిఓలతో సాధ్యపడుతోంది. మరి అలాంటి ఐపిఓలలో మొదటి రోజే 100శాతం  పెరిగిన వాటిలో కొన్నిటిని ఏరి కూర్చింది మనీకంట్రోల్ వెబ్‌సైట్. మనం దానికి ఇంకాస్త జోడించి, ప్రస్తుతం వాటి ధర ఎంత ఉందో కూడా పాఠకుల కోసం అందిస్తున్నాం. 

 


గత ఏడాదికాలంలో 4 సంస్థల షేర్లు 100శాతం కంటే ఎక్కువ లిస్టింగ్ గెయిన్స్ పంచగా, ఒక కంపెనీ దాదాపు వందశాతం  పెరిగింది. కెమ్‌కాన్ స్ఫెషాల్టీ కెమికల్స్ ఇష్యూ ధర కంటే 115శాతం లిస్టింగ్ గెయిన్స్ పంచగా, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ 111.4శాతం, రూట్ మొబైల్ 102.3 శాతం పెరిగి ట్రేడర్లకు సంబరాన్నిచ్చాయ్, ఇక మొన్నసోమవారం మార్కెట్లను  అల్లాడించిన జిఆర్‌ఇన్ఫ్రా, 103.1శాతం లాభపడగా, క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ 98.3శాతం లిస్టింగ్ రోజున పండగ చేసిన  సంగతి గుర్తుండే ఉంటుంది. 

 

ఇంకాస్త వెనక్కి వెళ్తే అంటే, 2019 లెక్క కూడా తీస్తే లిస్టింగ్ రోజున ఐఆర్‌సిటిసి 101.3శాతం లాభపడగా, డిమార్ట్ 2017లో  102.1శాతం , 2003లో ఇంద్రప్రస్థ గ్యాస్ 150శాతం పెరగగా, టివి టుడే నెట్వర్క్ 121.1శాతం లాభపడింది. మొత్తంగా ఈ  ఐపీఓలు అసలు లిస్టైన తర్వాత కూడా మార్కెట్ల ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం మరింత విశేషం

 

ఈ జోరు ఇక్కడితో ఆగదని, ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, కొత్త థీమ్‌లతో మార్కెట్లలోకి తమ వ్యాపారాలను విడగొట్టి మరీ ఐపీఓలతో హోరెత్తించనున్నాయ్. పేటిఎం,ఎల్ఐసి,ఎన్ఎస్ఈ,ఫ్లిప్‌కార్ట్, గోఎయిర్,పాలసీ బజార్,నైకా,హెచ్‌డిబి  ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్లను పలకరించబోతున్నాయ్

 

 


8 Ipos paytm lic route mobile clean gr infra happiest mind technologies hcl igl listing gains profit