రిజల్ట్స్ బావున్నా..టిసిఎస్ పడుతోందెందుకు? రీజన్ ఉందా గురూ!?

2021-04-13 11:22:58 By Anveshi

img

టిసిఎస్ Q4లోనూ, ఏడాది ప్రాతిపదికన మంచి ఫలితాలే ప్రకటించింది. ఐనా మరి ఎందుకు నష్టపోతోంది. పైగా నిఫ్టీ 30 షేర్లలో ఇవాళ ఉదయానికి ఇంత వరస్ట్ పెర్ఫామర్ ఇంకోటి లేదు. ఎందుకిలా జరుగుతోంది అంటే, ఒకటే రీజన్, ప్రాఫిట్ బుకింగ్, ఉదయం పది గంటలకు టిసిఎస్ షేరు 3శాతం పతనమై రూ.3146కి జారింది. ఇదే సమయంలో బిఎస్ఈ సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడింది

 

సోమవారం టిసిఎస్ స్ట్ర్రాంగ్ రెవెన్యూ, హెల్దీ నెట్ ప్రాఫిట్ అనౌన్స్ చేసింది. అలానే క్యు4లో 9.2 బిలియన్ డాలర్ల ఆర్డర్ బుక్ వేల్యూ కూడా సాధించింది. కరోనా కాలంలో 9246కోట్ల నికరలాభం అంటే సాధారణమైన విషయం ఏమీ కాదు, ఫుల్ ఇయర్‌లోనైతే, లక్షా65వేలకోట్ల ఆదాయం గడించింది టిసిఎస్. ఐతే అనలిస్టులు కొంతమంది మాత్రం స్టాక్ ధర ఇప్పటికే ప్రీమియం దాటేసిందని, అందుకే ఇప్పుడు పెద్దగా స్పీడ్ ఉండకపోవచ్చంటూ అభిప్రాయాలు వెల్లిబుచ్చడం ప్రారంభమైంది. ఈ ప్రభావం కూడా స్టాక్ ధరపై పడింది. 

ఉదాహరణకు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ టిసిఎస్ షేరును యాడ్ నుంచి హోల్డ్‌కి తన రికమండేషన్‌ను సవరించింది. అంటే కొత్తగా కొనద్దన్నట్లే అర్ధం.కొటక్ ఇన్స్‌ట్యూషనల్ ఈక్విటీస్ కూడా ఇదే బాటలో స్టాక్‌కి రెడ్యూస్( తగ్గించుకోమని) రేటింగ్ కంటిన్యూ చేసింది.గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ సిటీ గ్రూప్ అయితే టిసిఎస్‌ను అమ్మేయాలంటూ రికమండ్ చేసింది.నోమురా మాత్రం న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది.

ఐతే గోల్డ్‌మేన్ శాక్స్ మాత్రం టిసిఎస్‌ను రూ.3646 టార్గెట్ ప్రైస్‌గా కొనుగోలు చేయాలని రికమండ్ చేసింది.మాక్వేరీ సంస్థ కూడా రూ.3640 టార్గెట్‌గా ఔట్‌పెర్ఫామ్ రికమండ్ కాల్ ఇచ్చింది

స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి టిసిఎస్ షేరు ఎన్ఎస్ఈలో 3.48శాతం నష్టపోయి రూ.3133 వద్ద , బిఎస్ఈలో 3.33శాతం నష్టపోయి రూ.3133.50 వద్ద ట్రేడ్ అయ్యాయ్


tcs despite good numbers reason profit lose trade telugu stock nomura goldman sachs macqueri city buy neutral hold

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending