టెలికాం రంగంలో పిఎల్ఐకి ఎంపికైన కంపెనీలివే ! రూ.3345కోట్ల మేర ఇన్సెంటివ్స్ లభించే ఛాన్స్

2021-10-15 18:26:46 By Anveshi

img

కేంద్రం ప్రకటించిన ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్‌లో భాగంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, 31 ప్రతిపాదనలకు ఓకే చెప్పింది.రాబోయే నాలుగున్నరేళ్లలో రూ.3345కోట్ల మేర ప్రోత్సాహకాలు అందించేందుకు, నిర్ణయించినట్లు  కమ్యూనికేషన్స్ మినిస్టర్  దేవుసిన్హ్ చౌహాన్
గురువారమే చెప్పారు. ఇందుకు సంబంధించి, రాబోయే ఐదేళ్లలో ఇంకా 12195కోట్ల మేర ఇన్సెంటివ్స్ కోసం అర్హత సాధించిన కంపెనీలను కూడా ప్రకటించారాయన

 

31 కంపెనీలను టెలికాం రంగంలో పిఎల్ఐకి అర్హత సాధించినివిగా చెప్పగా, వాటిలో 16 MSME,15నాన్ ఎంఎస్ఎంఈలు( వీటిలో 7 గ్లోబల్ కంపెనీలు కూడా ఉన్నాయ్)ఉన్నట్లు తెలిసింది. 


MSME-కేటగరీలో
కోరల్ టెలికాం
ఎహూమ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
ఫ్రాగ్ సెల్‌శాట్
STL నెట్వర్క్స్


నాన్-ఎంఎస్ఎంఈ కేటగరీలో
HFCL టెక్నాలజీస్ ( లిస్టెడ్ కంపెనీ)
ఆక్ష్ఆస్థా టెక్నాలజీస్ ( లిస్టెడ్ కంపెనీ)
తేజాస్ నెట్వర్స్క్ ( లిస్టెడ్ కంపెనీ)
వివిడిఎన్ టెక్నాలజీస్


గ్లోబల్ కంపెనీలు
ఎరిక్‌సన్ సబ్సిడరీ-జాబిల్ సర్క్యూట్ ఇండియా
ఫాక్స్‌కాన్ సన్మినా
ఫ్లెక్స్‌ట్రానిక్స్
నోకియా ఇండియా

ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ‌స్కీమ్‌తో  ఈ రంగంలో కొత్తగా 40వేలమందికి, ఉపాధి కలగడంతో పాటు,  రూ.1.82లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయనేది టెలికాం శాఖ అంచనా


pli ericson.DoT hfcl aksh tejas

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending