తేగా అలాట్మెంట్ స్టేటస్ చూస్కుండిలా...తెగ రెస్పాన్స్ వచ్చిన ఐపిఓ మరి..!

2021-12-05 13:26:45 By Anveshi

img

తేగా ఇండస్ట్రీస్ ఐపిఓ ,  అలాట్మెంట్ ప్రాసెస్ ఆల్రెడీ  ప్రారంభం కానుండగా, డిసెంబర్ 9 నుంచి మనీ రిఫండ్ అవడం ప్రారంభం అవుతుంది.డిసెంబర్ 10 నుంచి డీమ్యాట్ అక్కౌంట్లలో షేర్లు కన్పిస్తాయ్

 

ఐపిఓ హిస్టరీలోనే సిక్స్త్ లార్జెస్ట్ సబ్ స్క్రిప్షన్ సాధించిన తేగా, మొత్తం 219 రెట్లకిపైగా ఆదరణ లభించడంతో మరి లిస్టింగ్ పై ఇంట్రస్ట్ లేకుండా ఎలా ఉంటుంది అందులోనూ..క్వుఐబి పోర్షన్ అయితే ఏకంగా 215రెట్లు  సబ్ స్క్రైబ్ అయింది. ఇదిగతదశాబ్దకాలంలోనే  మొదటిసారి. కంపెనీ ఐపిఓ ద్వారా రూ.619 కోట్లు ద్వారా రాబట్టనుంది. మొత్తం ఆఫర్ ఫర్ సేల్ ద్వారానే ఇష్యూ పూర్తవనుంది

 

రూ.809-903 తేగా ఇండస్ట్రీస్ ఐపిఓ  ఇష్యూ ప్రైస్ బ్యాండ్ కాగా, గ్రేమార్కెట్ లో రూ.410-450 ప్రీమియం పలుకుతోంది.అంటే లిస్టింగ్ రోజున రూ.1310పైనే ధర స్క్రీన్ పై కన్పించనుంది

 

బిఎస్ఈ వెబ్ సైట్ కి వెళ్లి ఇష్యూటైప్ సెలక్ట్ చేయాలి. 
2.అప్లికేషన్ నంబర్, పాన్ నంబర్ ఎంటర్ చేయండి
3. I am not robot అనే చెక్ బాక్స్ ని క్లిక్ చేసి సెర్చ్ చేయండి


కంపెనీ రిజిస్ట్రార్ వెబ్ సైట్ కి కూడా వెళ్లి చూడొచ్చు
1. కంపెనీ పేరు( Tega industries limited)
2. పాన్ నంబర్, అప్లికేషన్ నంబర్, డిపి ఐడి మూడింట్లో ఏదోటి సెలక్ట్ చేసుకోండి
3. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి


తేగా ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అతి పెద్ద పాలీమర్ మిల్ లైనర్ ప్రొడ్యూసర్.అలానే మన దేశంలో మైనింగ్, బల్క్ సాలిడ్ పదార్ధాల్లో  క్రిటికల్ స్పెషలైజ్డ్ 
ఉత్పత్తులను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. వీటి హ్యాండ్లింగ్ కి అవసరమైన ఉత్పత్తుల తయారీలో అగ్రగామి


TWG ipo