52 వారాల ధరతో టిసిఎస్ సయ్యాట ! ఇంకో 13% ర్యాలీ మిగిలి ఉందంటున్న అనలిస్టులు

2021-06-18 11:40:22 By Anveshi

img

టెక్ దిగ్గజం టిసిఎస్ వరసగా రికార్డు ధరలను తాకుతోంది. ఇవాళ ఇంట్రాడేలో టిసిఎస్ రూ.3357.85కి ఎగసిన టాటా  కన్సల్టెన్సీ సర్వీసెస్ 52 వారాల ధర అయిన రూ.3358.80కి చాలా దగ్గరలో  ట్రేడ్ అయింది. ఐతే ఆ తర్వాత ట్రెండ్‌లో కొట్టుకుపోయి కిందికి పడింది. 

 

గత ఏడాది కాలంగా టిసిఎస్ 62శాతం పెరగగా, 2021లోనే 16శాతం లాభాలను పంచింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ పదిశాతం మాత్రమే పెరిగింది. ఈ మధ్యనే టిసిఎస్ షేర్లు 2004 నుంచి 3వేలశాతం లాభం పంచిందంటూ చెప్పుకొచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది

 

సంస్థ సీఈఓ రాజేష్ గోపీనాధన్ ప్రకారం, టిసిఎస్ మూడు జోన్లలో వృద్ధి సాధించబోతోంది, బిజినెస్ మోడల్స్‌లో నూతన  పద్దతులు, డేటా అనలిటిక్స్‌లో లెవరేజ్, క్లౌడ్ ఎకో సిస్టమ్ వ్యాపారాల్లో టిసిఎస్ రాబోయే రోజుల్లో ఇతర కంపెనీలతో కలిసి  కూడా పని చేయబోతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రతి క్వార్టర్‌కి లాభాలను పెంచుకుంటూ పోతోంది. గత  రెండేళ్లుగా టిసిఎస్ ఇదే జోరు ప్రదర్శిస్తుండగా సంస్థ షేరులో ఇంకా స్టీమ్ మిగిలే ఉందని అనలిస్టులు చెప్తున్నారు

 

కేపిటల్ వయాగ్లోబల్ రీసెర్చ్ కంపెనీకి చెందిన ఆశిష్ బిశ్వాస్ టిసిఎస్ ప్రస్తుత ధర వద్ద కూడా కొనుగోలు చేయవచ్చని రూ.3740 టార్గెట్ కోసం ఎదురుచూడొచ్చని రికమండ్ చేశారు.


హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌కి చెందిన దేవార్ష్ వకీల్, టిసిఎస్ స్టాక్‌కు రూ.3470 ధర టార్గెట్‌గా యాడ్ రికమండేషన్ ఇచ్చారు 


tcs 52 weeks high price buy add call recommendation telugu profit