కెపాసిటీ డబుల్ ప్లాన్స్..! మరీ టాటా స్టాక్ పవర్ చూపిస్తుందా ?

2021-04-08 13:06:56 By Anveshi

img

సోలార్ పవర్‌ ప్రొడక్షన్ కెపాసిటీ డబుల్ 
300మెగావాట్ల నుంచి 530 మెగావాట్లకి పెంపు
మోనో పెర్క్ హాఫ్ కట్ టెక్నాలజీ  జోడింపు
175 GW  ఎనర్జీ లక్ష్యంలో వాటా కోసం రేసు

పిఎల్ఐ స్కీమ్‌తో సోలార్ ఫోటో వోల్టిక్ ఇండస్ట్రీలో 17200కోట్ల పెట్టుబడులకు ఛాన్స్
ఆత్మనిర్భర్ భారత్ కానీయండి, మేక్ ఇన్ ఇండియా అనండి పేరేదైనా, ఇక్కడి కంపెనీలకు ప్రోత్సాహం, ప్రపంచదేశాలకు ఎగుమతులే లక్ష్యంగా కేంద్రం వివిధ పరిశ్రమలకు రాయితీలు ప్రకటిస్తోంది. ఇందులో భాగంగానే ఉత్పత్తి ఆధారిత రాయితీల పథకం( ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్)ను సోలార్ ప్యానెళ్ల తయారీ కేంద్రాలకు కూడా అమలు చేస్తోంది. దీన్ని  అంది పుచ్చుకునేందుకు టాటా కంపెనీ రెడీ అయిపోయింది. ఇందుకోసం బెంగళూరులోని సోలార్ సెల్( బ్యాటరీలు), సోలార్ మాడ్యూల్స్ తయారీ సామర్ధ్యాన్ని 1.1 గిగావాట్‌కి పెంచింది. అంతేకాదు కేంద్రం వచ్చే ఏడాది చివరికల్లా రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో 175 గిగావాట్లను టార్గెట్‌గా పెట్టుకోగా, అందులో భారీగా వాటాపై రేసులో ముందుకొచ్చేసింది. ఇప్పటికే ఈ  రంగంలో అదానీ గ్రూప్ బిగ్ ప్లేయర్‌గా ఉండగా తానూ పోటీలో ఉన్నానంటోంది టాటా పవర్.

బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
సోలార్ ప్యానెళ్లు కానీ, సౌర ఉత్పత్తులు ఏవైనా సరే ఇంతకు ముందు వరకూ చైనా నుంచి మన దేశంలోకి రూ.4500కోట్ల విలువైన దిగుమతులు చేసుకుంటున్నాం. చైనాకి చెక్ పెట్టడంతో పాటు ప్రపంచానికి మరో తయారీ హబ్‌గా భారత్ ఆవిర్భవించేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయ్. అందులో భాగంగానే సోలార్ ప్యానెళ్లకు కూడా ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఈ రంగంలో ఉన్న అన్ని కంపెనీలు తమ లక్ టెస్ట్ చేసుకోబోతున్నాయ్. వాటిలో టాటా పవర్ ముందస్తుగానే తన తయారీ యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచింది. మోనో పెర్క్  టెక్నాలజీ  ఆధారితంగా 300 మెగావాట్ల నుంచి 530మెగావాట్లకు,  మోనో పెర్క్ హాఫ్ కట్ టెక్నాలజీ ఆధారితంగా 400 మెగావాట్ల నుంచి 580 మెగావాట్లకు పెంచింది. 

ఐతే ఇది ఒక్క కేంద్రం ప్రకటించిన రాయితీలపైనే కాకుండా, సోలార్ మాడ్యూల్స్‌కి దేశంలో పెరిగిన డిమాండ్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయంగా టాటా పవర్ ప్రకటించింది. అంతర్జాతీయంగా గ్రీన్ ఎనర్జీ( పర్యావరణ హిత విద్యుత్)కి ఏర్పడిన ప్రాథాన్యత, ఈరంగంలో భారత్ లీడర్‌గా ఎదగగల అవకాశాలను కొట్టిపారేయలేం. ఐతే మన దేశంలో ఇప్పటికి కేవలం  3గిగావాట్ల సోలార్ సెల్స్ ఉత్పత్తి, 15గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ సామర్ధ్యం మాత్రమే ఉంది. ఇప్పుడు కేంద్రం  ప్రోత్సాహంతో ఇది మరింత పెరగనుంది.  ఈరంగంలోకి 15 కంపెనీలు రాగా, 3 బిలియన్ డాలర్లు ఒక్క ప్లాంట్ల స్థాపనలోనే ప్రవహించనున్నట్లు అంచనా

మరి మన కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ ఎలా..?

పర్యావరణ హిత విద్యుత్,ఎనర్జీ రంగంలో సోలార్ ప్యానెళ్లు, మాడ్యూల్స్, సెల్స్‌దే కీలక పాత్ర. కానీ అందుకోసం మనం చైనాపైనే ఎక్కువ ఆధారపడుతున్నాం. ఇక్కడ డిమాండ్ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో వాటి రేట్లూ భారీగానే ఉంటాయ్. అదే  వినియోగం ఎక్కువైతే, వాటి రేట్లు తగ్గొచ్చు. పైగా మన దేశంలో చైనా మేడ్ సోలార్ ప్యానెళ్లు, మాడ్యూల్స్‌దే డామినేషన్ కాగా, రెండేళ్ల క్రితం చైనా నుంచి 2.16 బిలియన్ డాలర్ల మేర సోలార్ ఫోటోవోల్టిక్ ఉత్పత్తులుదిగుమతి అయ్యాయ్. అంతే కాకుండా గత డిసెంబర్‌లోనే చైనా దేశపు సోలార్ ఉత్పత్తులపై ధర 20శాతం పెరిగింది. 

సిచ్యుయేషన్ ఇలా ఉంది కాబట్టే, సోలార్ మాడ్యూల్స్ దిగుమతులపై కేంద్రం 40శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పెంచింది. సోలార్ సెల్స్‌( బ్యాటరీలు)పై 25శాతం దిగుమతి సుంకం పెంచింది. దీంతో దిగుమతుల భారం దేశంలోని వ్యాపార సంస్థలు భరించలేవ్. మరోవైపు తక్కువ రేట్లలో వీటి ఉత్పత్తులు జరగాలంటే భారీగా వ్యాపార అవకాశాలుండాలి. అందుకే కేంద్రం పెట్టిన 175  గిగావాట్ల ఎనర్జీ లక్ష్యం, ఈ కంపెనీలకు తమ ఉత్పత్తులకు గ్యారంటీ కల్పించే ఓ ఛాన్స్. అలా మన దేశీయంగా వీటి వ్యాపారం ఊపందుకోనుంది.  175 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీలో సోలార్ ఎనర్జీ వాటా 100గిగా వాట్లు. అంటే ఇప్పుడు టాటా పవర్ తన ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకోవడంలో మంచి వ్యూహం ఉందనే అర్ధమవుతోంది కదా..అంటే రాబోయే రోజుల్లో ముందు చెప్పినట్లుగా కేంద్రం ముందున్న 15 కంపెనీలు, ఎన్ని ప్రాజెక్టులు దక్కించుకుంటే అంత లాభం తవ్వుకోవచ్చన్నమాట. మరి టాటా పవర్ చేయబోతున్నది అదేనంటారు..!

( ప్రస్తుతం టాటా పవర్ స్టాక్  2శాతం లాభపడి రూ.106.60 వద్ద ట్రేడ్ అయింది)
 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending