టాటా మోటర్స్ బీభత్సమైన ర్యాలీకి మార్కెట్లలో కనకవర్షం..! ఇంట్రాడేలో ఇరవైశాతం, నెలలో 90% ప్రాఫిట్! సీట్లలో కూర్చోలేకపోతున్నాం బాసూ..!

2021-10-13 11:40:52 By Anveshi

img

టాటా మోటర్స్ ర్యాలీకి పాత రికార్డులు బద్దలైపోయాయ్. ఇవాళ ఇంట్రాడేలో ఈ స్టాక్ నిన్నటి ముగింపు అయిన రూ.420తో పోల్చితే  ఏకంగా 20శాతం పెరిగి రూ.502.90 ధర దగ్గర కొత్త 52 వారాల గరిష్టాన్ని సృష్టించింది.దీంతో పాటే మార్కెట్ కేపిటలైజేషన్ కూడా లక్షా70వేలకోట్లకి చేరింది.

 

నిన్న సాయంత్రం మార్కెట్ క్లోజైన తర్వాత రెగ్యులేటరీ సంస్థలకు తన ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో TPG గ్రూప్ కంపెనీ రూ.7500కోట్ల మేర పెట్టుబడి పెట్టనుందంటూ టాటా సంస్థ తెలియబరచింది. ఆ సంగతి మార్కెట్లకు ముందే తెలుసన్నట్లుగా నిన్ననే ఈ స్టాక్ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఆ మాటకి వస్తే ఈ జోరు గత వారం నుంచీ సాగుతున్నదే. దీంతో ఇవాళ మార్కెట్లు ఓపెన్ అవగానే, స్టాక్స్ కొనుగోలు చేసేందుకు జనం ఎగబడటంతో..వాల్యూమ్స్ అమాంతంగా పెరిగిపోయాయ్..కథనం రాసిన సమయానికి పదికోట్లకి పైగా షేర్లు చేతులు మారాయ్.  ఇందులో డెలివరీ వాల్యూమ్ ఎంతన్నది పక్కనబెడితే, ఈ స్టాక్ ఏ రేంజ్‌కి వెళ్తుందన్నదానిపై అంచనాలే ఈ రద్దీకి కారణం

 

చదవండి మా గత కథనం టాటా గ్రూప్‌లో భారీ పెట్టుబడి..! రూ.70వేలకోట్ల విలువ అందుకున్న టాటా మోటర్స్ ఎలక్ట్రిక్ వెహికల్ విభాగం ! వరసగా ఎన్ని డెవలప్‌మెంట్సో..మరి షేరు ధర పెరగకుండా ఉంటుందా..?    కోసం ఇక్కడే క్లిక్ చేయండి

 

రెండు నెలల క్రితం టాటా మోటర్స్ షేరు రూ.300 కిందకు కూడా పడిపోయింది. ఖచ్చితంగా సెప్టెంబర్ 13న ఈ స్టాక్ రూ.300 వద్ద ట్రేడవగా, అప్పట్నుంచి  చూస్తే..ఇప్పటికి 90శాతం పెరిగింది. అలానే ఈ వారం రోజుల్లో నాలుగు సెషన్లలోనే రూ.336(అక్టోబర్ 6నాటి ధర) నుంచి రూ.502కి ఎగసింది. అంటే సగటున రోజుకి 20శాతం లాభం పంచింది. అందుకే ఈ బీభత్సమైన ర్యాలీకి ట్రేడర్లెవరూ సీట్లలో కుదురుగా కూర్చోలేబోతున్నారంటే ఆశ్చర్యం లేదు.

 

ఎప్పటికప్పుడు డెలివరీ తీసుకోవడం ఓ పది రూపాయలు లాభం రాగానే అమ్మడంతో, అక్కడ్నుంచి కూడా పెరుగుతున్న టాటా మోటర్స్ స్టాక్ ఈ మధ్యకాలంలో ఇంట్రాడేలో 20శాతం పెరిగిందే లేదు..ఇదో రికార్డ్..అంతేకాదు అసలిప్పుడు మార్కెట్లలో టాటా గ్రూప్ స్టాక్స్  పేర్లు రీసౌండ్ ఇస్తున్నాయంటే అతి చేసి చెప్పడం కాదు


tamo tatamotors tesla pse tpg rally uc 20 52weeks high

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending