లాభాల సుప్రీమ్..!Q4 రిజల్ట్ ఎనర్జీ,షేర్ ప్రైస్@రికార్డ్ లెవల్! లాంగ్ టర్మ్ వ్యూ ఏంటి?

2021-05-04 11:01:46 By Anveshi

img

Q4లో అదరగొట్టిన సుప్రీమ్

రూ.450కోట్ల నికరలాభం

రూ.17 డివిడెండ్ ప్రకటన

రికార్డు ధరకి చేరిన షేరు ధర

రూ.759కోట్ల సర్‌ప్లస్ మనీ

పూర్తి ఋణరహిత కంపెనీగా ఆవిర్భావం

 

మంగళవారం మార్కెట్లలో సుప్రీం ఇండస్ట్రీస్ షేర్లు 4శాతానికిపైగా పరుగులు పెట్టాయి. ఇంట్రాడేలో రూ.2200ధరకి పెరిగి రికార్డు స్థాయి రేటు పలికాయి. క్యు4లో పటిష్టమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించడమే ఇందుకు కారణం. 

 

క్యు4లో సుప్రీం ఇండస్ట్రీస్ కన్సాలిడేటెడ్ నికరలాభం రూ.450కోట్లుగా నమోదు అయింది. ఇదే గత ఏడాది క్యు4లో ఈ లాభం రూ.114కోట్లు మాత్రమే. దీంతో  భారీ ఆదాయం గడించిన ఈ ప్లాస్టిక్ పైపులు, ట్యాంకుల తయారీ కంపెనీపై ట్రేడర్ల ఫోకస్ పడింది

 

దీనికి తోడు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ సంస్థ, సుప్రీమ్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ వ్యూ బ్రహ్మాండంగా ఉన్నట్లు రికమండ్ చేసింది,  పైపింగ్ సెగ్మెంట్లో సుప్రీం నిజంగానే సుప్రీం అని కితాబు ఇచ్చింది. డిమాండ్ బలంగా ఉన్న  నేపథ్యంలో కంపెనీ లాభదాయకతకు ఢోకా లేదని చెప్పింది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాస్పెక్టస్‌లో రూ.2085కోట్ల ఆదాయం గడించింది సుప్రీం  ఇండస్ట్రీస్, ఇది 46శాతం వృద్ధికి సమానం. 


సుప్రీం సంస్థ రియలైజేషన్స్ కూడా 35శాతం పెరగడం విశేషం, ఎబిటా  మార్జిన్లలో విస్తరణ, అమ్మకాల పరిమాణంలో 8శాతం వృద్ధి నమోదు చేసిన సంస్థ బోర్డు వాటాదారులకు ప్రతి షేరుకు రూ.17 ఫైనల్ డివిడెండ్  ప్రకటించింది. అంతేకాదు కంపెనీకి మరో ప్లస్ పాయింట్ కూడా ఇదే  ప్రకటనలో తెలియజేసింది. 2021 ఆర్థిక సంవత్సరంలో సుప్రీమ్ ఇండస్ట్రీస్ అప్పుల్లేని కంపెనీగా ఆవిర్భవించినట్లు, రూ.759కోట్ల మిగులు ధనం  ఉన్నట్లు చెప్పింది. దీంతో కంపెనీ షేర్ల రీరేటింగ్ జరుగుతుందనే అంచనాలు  నెలకొన్నాయ్. గత ఏడాది మార్చి (2020)లో కంపెనీకి  రూ.217కోట్లు అప్పులు ఉండగా, అవి తీరిపోవడమే కాకుండా ఇప్పుడు సర్‌ప్లస్ మనీ ఉన్న కంపెనీగా సుప్రీం ఇండస్ట్రీస్ ఆవిర్భవించడం విశేషం. 

 

అంతేకాదు కంపెనీ ప్రస్తుత కరోనా సంక్షోభంలోనూ కేపెక్స్ వ్యయాన్ని  తగ్గించడం లేదని ప్రకటించింది. ఈ ఆర్థికసంవత్సరంలో దాదాపు  రూ.400కోట్ల మేర ఉత్పాదక వ్యయాన్ని కేటాయించినట్లు చెప్పింది.  ఇందులో గత ఏడాది ప్రకటించిన రూ.198కోట్లు కూడా కలిపే ఉన్నాయి  కేంద్రం తాలుకూ జల్‌జీవన్ మిషన్, స్వచ్ఛ్ భారత్ అభియాన్, పరిశుభ్రత కార్యక్రమాలు, అందుబాటు ధరలో ఇళ్ల నిర్మాణం వంటి అనేక పథకాలు ప్లాస్టిక్ పైపింగ్ కంపెనీలకు వరం కాగా, అందులోనూ వాతావరణం  అనుకూలంగా ఉండటంతో వ్యవసాయ కార్యక్రమాలకు అవసరమైన క్రాస్ లామినేటెడ్ ఫిల్మ్ ఉత్పత్తులు కూడా సుప్రీం ఇండస్ట్రీస్  అందిపుచ్చుకోనందంటున్నారు. తాత్కాలికంగా లాక్‌డౌన్లతో ఒత్తిడి  ఎదుర్కొన్నా, లాంగ్‌టర్మ్‌లో మాత్రం సుప్రీమ్ ఇండస్ట్రీస్ పాజిటివ్ ట్రెండ్ కనబరుస్తుందని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది

ప్రస్తుతం సుప్రీం ఇండస్ట్రీస్ షేర్లు 3.83శాతం లాభంతో 2189.30 వద్ద ట్రేడ్ అయ్యాయ్


supreme industries record high q4 icici securites pipes plastic products telugu profit trade

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending