మైండ్ ట్రీ, టైటన్..సహా ఓ 6 స్టాక్స్ యాక్షన్ గమనించండి..!

2022-01-14 07:49:54 By Anveshi

img

మైండ్ ట్రీ
మైండ్ బ్లోయింగ్ ప్రాఫిట్ రూ.437.5 కోట్లను క్యు3లో ఆర్జించింది. గత ఏడాది ఇదేకాలంలో ఈ  లాభం రూ.398.9కోట్లు రెవెన్యూ కూడా రూ.2586.2 కోట్ల నుంచి రూ.2750కోట్లకి పెరిగింది

 

టాటా మెటాలిక్స్
రూ.35.65కోట్ల లాభానికే ఈ క్యు3లో పరిమితం అయింది. ఇదే గతేడాది క్యు3లో ఈ లాభం రూ.75.18కోట్లు. అంటే సగం క్షీణించింది.ఐతే రెవెన్యూ మాత్రం రూ.526.23 కోట్ల నుంచి రూ.689.90కోట్లకి ఏటికేడాది ప్రాతిపదికన పెరిగింది

 

వికాస్ లైఫ్‌కేర్
జెనెసిస్ గ్యాస్ సొల్యూషన్స్‌లో 75శాతం వాటా దక్కించుకుంది. ఈ కంపెనీ స్మార్ట్ గ్యాస్ మీటర్లు, పవర్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోని ఉత్పత్తులను డెవలప్ చేస్తుంది

 

ప్లాస్టిబెండ్స్ ఇండియా
రూ.12.07కోట్ల అధిక లాభం గడించింది. గత ఏడాది క్యు3లో ఇది రూ.11.37 కోట్ల లాభం ఆర్జించిన ప్లాస్టిబెండ్స్, ఆదాయం రూ.160.4 కోట్ల నుంచి రూ.174.14కోట్లకి పెరిగింది

 

హిందుస్తాన్ ఏరోనాటిక్స్
కంపెనీ లాంగ్ టర్మ్‌ రేటింగ్‌ని AA+ నుంచి AAAకి మార్చడంతో పాటు స్టేబుల్‌ నుంచి పాజిటివ్‌గా ఔట్‌లుక్‌ని మార్చింది

 

టైటన్
రాకేష్ ఝన్‌ఝన్‌వాలా తన వాటాని 3.80శాతం నుంచి 4.02శాతానికి గడచిన త్రైమాసికంలో పెంచుకున్నట్లు తెలిసింది.కంపెనీలో ఈయనకి ఇప్పుడు 3,57,10,395షేర్లున్నాయ్. ఆయన భార్య రేఖకి 1.07శాతం వాటా అలానే కొనసాగుతోంది

 


titan