ఇండెక్స్‌లలో పదేళ్లలో జరగనది 2021లో జరిగిందిట..! జాగ్రత్తగా ఉండాల్సిన సమయమా మిత్రమా..!

2021-06-10 17:10:50 By Anveshi

img

స్టాక్ మార్కెట్లలో జోరుకు పగ్గాలు లేకుండా బుల్ రైడ్ సాగుతోంది. ఇన్ని రోజులూ ఆల్ టైమ్ హై లెవల్‌ని దాటలేదంటా అని, ఇన్వెస్టర్లు వర్రీ అయితే ఇప్పుడు కొత్త వర్రీ మొదలైంది. ఇంత భారీగా పెరిగింది, అకస్మాత్తుగా కరెక్షన్ వస్తుందేమో అనే చిన్నపాటి భయం ప్రారంభమైంది. దీనికి తోడు గత పదేళ్లలో మొదటిసారిగా లార్జ్ క్యాప్ వేల్యేషన్‌ని స్మాల్‌క్యాప్ ఇండెక్స్ దాటేసింది. దీంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదేనంటూ చాలామంది హెచ్చరికలు జారీ చేయడం ప్రారంభించారు

 

2021లో నిఫ్టీ 12శాతం పెరిగింది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 27శాతం పెరిగింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 35శాతం పెరిగి స్టార్ పెర్ఫామర్‌గా నిలిచింది.ఓ వైపు కరోనాతో మన జిడిపిని రేటింగ్స్‌ని చాలా ఏజెన్సీలు కట్  చేస్తున్నాయ్. ఐనా మన సూచీల్లో ఎంత మాత్రం మార్పులేదు. అత్యధిక గరిష్టాలను అధిగమిస్తూ పోతూనే ఉన్నాయ్.ఈ ర్యాలీ కూడా బ్రాడ్ బేస్డ్‌గా లార్జ్,మిడ్, స్మాల్ క్యాప్‌ స్టాక్స్ అన్నీ పెరుగుతున్నాయ్. 

 

అందులో స్మాల్ క్యాప్ ర్యాలీ చూస్తుంటే, ఎవరికైనా నోరూరకతప్పదు. పదహారు రూపాయలు పెట్టి ఓ వెయ్యి షేర్లు కొంటే రెండు మూడు నెలల్లోనే రెట్టింపు అవుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయ్. దీంతో ఎక్కడైనా స్మాల్‌క్యాప్ షేర్ల గురించిన టాక్ విన్పిస్తే వెంటనే కొందరు సొల్లు కార్చుకుంటూ మరీ ఎగబడి వింటున్నారంటే సందేహమే లేదు. ఇంత భారీగా  పెరుగుతున్న సమయంలోనే, వాటి వేల్యేషన్స్ ఫెయిర్‌గా ఉన్నాయా లేదా అనే కలవరం ప్రారంభమవుతోంది. 

 

మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌ డైరక్టర్ మిహిర్ ఓరా  అయితే, ఏకంగా ట్విట్టర్‌లోనే తన సందేహాన్ని వెల్లిబుచ్చారు. ఏదో  నురగలాగా,,పాల పొంగులాగా ఈ పెరుగుదల కన్పిస్తోంది.తేడా వస్తే సర్దుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు

అలానే కొంతమంది ఇప్పుడు నిఫ్టీ 2021గానూ 29-30 పిఈ వద్ద 2022కు గానూ 24-25 పీఈ వద్ద ట్రేడవుతోందని ఇలాంటి సందర్భాల్లో 7-9శాతం కరెక్షన్ సహజంగానే చోటుచేసుకునే అవకాశముందంటున్నారు. గత పదేళ్లుగా పీఈ వేల్యూ 21-22కి చేరినప్పుడల్లా కరెక్షన్ వచ్చిందంటున్నారు    

 

గతకొద్ది రోజులుగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్లలోని కొన్ని షేర్లు షార్ప్‌గా పెరుగుతున్నాయని, బుక్ వేల్యూలతో సంబంధం లేకుండా ఇలా పెరగడం ఖచ్చితంగా అప్రమత్తంగా మెలగాల్సిన అవసరాన్ని సూచిస్తుందని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్  శ్రీకాంత్ చౌహాన్ చెప్తున్నారు 

 


small cap large mid valuation stocks high range correction PE ALERT CAUTIOUS

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending