రూ.60-600 లాభం కోసం ఈ 6 స్టాక్స్ ! కేఆర్‌చోక్సే షార్ట్‌టర్మ్ రికమండేషన్స్

2021-04-08 14:39:47 By Anveshi

img

స్టాక్ మార్కెట్లు తిరిగి కాస్త ఉత్సాహం పుంజుకున్నాయ్. ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను ఏ మాత్రం టచ్ చేయకుండా యాజ్ ఇటీజ్ పాలసీకే ఓటేసింది. దీంతో బిఎస్ఈ,ఎన్‌ఎస్‌ఈలో సెక్టోరియల్ స్టాక్ యాక్టివిటీ కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో కేఆర్ చోక్సే బ్రోకింగ్ ఏజెన్సీ ఓ ఆరు స్టాక్స్‌ని షార్ట్ టర్మ్ కోసం రికమండ్ చేసింది అవి

1.ఏసిసి I సిఎంపి- రూ.1917.30  I టార్గెట్ రూ.2185


కెపాసిటీ ఎక్స్‌పాన్షన్‌తో పాటు ఉన్న ఉత్పత్తిని పూర్తి స్థాయిలో వినియోగించడంతో మంచి రెవెన్యూ వచ్చే అవకాశాలు  కన్పిస్తున్నాయ్. మార్జిన్ ప్రొఫైల్ ఇంప్రూవ్‌మెంట్‌పై మేనేజ్‌మెంట్ ఫోకస్ చేయడంతో పాటు ప్రీమియం ఉత్పత్తుల వాటా పెరగడంతో సంస్థ ఆదాయం చక్కగా వృద్ధి నమోదు చేస్తుంది

 

2.అలెంబిక్ ఫార్మా సూటికల్స్ I సిఎంపి-రూ.973.25 I టార్గెట్ రూ.1286


FY22kf 23.5 రెట్ల పీఈ మల్టిపుల్స్‌తో స్టాక్‌ నడస్తుంది అలానే ఈపిఎస్ రూ.54.7గా కనబడుతోంది. దీంతో ఆదాయంలో వృద్ది  నమోదు అవుతుందనే అంచనాతో టార్గెట్ ప్రైస్‌ను కేఆర్ చోక్సే సంస్థ రూ.1286గా పెట్టుకోవాలని సూచించింది. 

 

గ్రాన్యూల్స్ ఇండియా Iసిఎంపి- రూ.331.05 I  టార్గెట్ రూ.459


ఈ రెండు ఫైనాన్షియల్ ఇయర్స్‌లో గ్రాన్యూల్స్ ఇండియా రెవెన్యూ 20.3శాతం, సిఏజిఆర్ 41.7శాతం నమోదవుతుందని  అంచనా. హయ్యర్ లెవల్ నుంచి 6.2శాతం నష్టపోయిన గ్రాన్యూల్స్ ఇండియా 14.0/12.4 పీఈ మల్టిపుల్స్‌లో ట్రేడవుతోంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఈ సంస్థ పీఈని 19రెట్లు ఎర్నింగ్ పర్ షేరును రూ.25గా కేఆర్ చోక్సే అంచనా వేస్తోంది. 

 

బజాజ్ ఫైనాన్స్ I సిఎంపి- రూ.5076.75I  టార్గెట్ రూ.5760


రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాలకు బజాజ్ ఫైనాన్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్‌లో 30శాతం సిఏజిఆర్, అడ్వాన్స్‌లో 25శాతం సిఎజిఆర్ నమోదవవుతుందని కేఆర్ చోక్సీ సంస్థ అంచనా. ప్రస్తుతం ఈ షేరు 2023 ఆర్థికసంవత్సరానికి 6.2x పీ/ఏబివిలో ట్రేడవుతోంది. దీంతో రాబోయే రిజల్ట్స్ సీజన్ లోపే బజాజ్ ఫైనాన్స్ షేరు రూ.5760కి ఎగయనుందని కేఆర్ చోక్సే రికమండ్ చేసింది

 

టాటా మోటర్స్ I సిఎంపి- రూ.307.80I  టార్గెట్ రూ.360


టాటా మోటర్ సేల్స్ వాల్యూమ్స్ మంచి డిమాండ్ తో పెరుగుతున్నాయ్.అంతర్జాతీయంగా అమ్మకాలు బావున్నాయి.  వ్యయాన్ని నిర్వహించడంలో క్యాష్ సేవ్ చేయడంలో మంచి ప్రతిభ కనబరచిన టాటా మోటర్స్ రాబోయే రెండు ఆర్థిక  సంవత్సరాల్లో కంపెనీ సిఏజిఆర్ 6.6శాతం, టాప్ లైన్ రెవెన్యూ / ఎబిటా 25శాతం, నమోదు చేయగలదు. 

 

ఇన్ఫోసిస్  Iసిఎంపి-  రూ.1430.25 I  టార్గెట్ రూ.1675


ఈ సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ  యూఎస్ డాలర్ రెవెన్యూలో  14శాతం, ఎబిటాలో 13శాతం,ఈపిఎస్‌లో14శాతం సిఎజిఆర్  వృద్ధి చెందుతుందని అంచనా షేరు  పీఈ 2022కి 25.5 రెట్లు, 2023కి 23.2రెట్లలో ట్రేడవుతోంది. దీంతో ఈ స్టాక్‌ని కొనుగోలు  చేయమని స్ట్రాంగ్‌గా కేఆర్ చోక్సీ రికమండ్ చేస్తోంది

 

( పైన స్టాక్ సిఎంపిలు ఏప్రిల్7 నాటి క్లోజింగ్ ప్రైస్, దాంతో పాటే స్టాక్ రికమండేషన్స్ కేఆర్ చోక్సే సంస్థ రికమండషన్స్, ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సైట్‌వి కాదు, లాభనష్టాలకు ఇన్వెస్టర్లదే బాధ్యత)

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending