3 హాట్ స్టాక్స్..ఎప్పుడూ కొనడమేనా? ఈ 2 షేర్లు అమ్మేయండి

2021-02-22 16:50:54 By Anveshi

img

ఈ వారం స్టాక్ మార్కెట్ ఇంట్రస్టింగ్‌గా గడవబోతోంది. ఎఫ్ అండ్ ఓ  ఎక్స్‌పైరీ ఉండటంతో పాటుగా, గత నాలుగు సెషన్లు నష్టాలతో ముగిశాయ్. ఇక్కడ్నుంచి తిరిగి పైకి పరుగులు పెడతాయా లేకపోతే కొన్నాళ్లపాటు డౌన్ ట్రెండ్ కన్పిస్తుందా అనేది ఆసక్తిగొలుపుతోంది. శుక్రవారం సెషన్‌లో  సైకలాజికల్‌గా  15వేల పాయింట్ల మార్క్ దిగువకు నిఫ్టీ ట్రేడవడం, హయ్యర్ లెవల్స్ వద్ద ప్రాఫిట్ బుకింగ్ కన్పించడం అబ్జర్వ్ చేశాం. ఈ దశలో ఓ మూడు స్టాక్స్‌పై ఏంజెల్ బ్రోకింగ్‌కి చెందిన సమీత్ చవాన్ తన స్ట్రాటజీని వ్యూయర్స్‌కి రికమండ్ చేశారు. వాటిని చూడండి..

కొనండి |  పెట్రోనెట్ ఎల్ఎన్‌జి |  ఎల్ టిపి రూ. 253.30 | టార్గెట్: రూ.265 | స్టాప్‌లాస్: రూ. 246 | అప్‌సైడ్e: 5%
గత కొన్నాళ్లుగా కన్సాలిడేషన్ దశలో ఉన్న ఈ పెట్రోనెట్ ఎల్ఎన్‌జిలో కింది స్థాయికి పడినప్పుడల్లా బయింగ్ ట్రెండ్ కన్పించింది. అలానే రెసిస్టెన్స్ జోన్‌ దగ్గరకు రాగానే ప్రాఫిట్ బుకింగ్ చేయడం అబ్జర్వ్ చేయవచ్చు. అలానే టైమ్‌ఫ్రేమ్ ఛార్ట్ లో షేరు ధర 200 రోజుల  సింపుల్ మూవింగ్ యావరేజ్‌పైన కన్పిస్తుంది.  ఈ కౌంటర్‌లో డైలీ వాల్యూమ్స్‌లో కూడా మంచి గ్రోత్ కన్పిస్తుంది

అమ్మండి | ఎల్‌టిపి: రూ. 124.45 | టార్గెట్: రూ.114 | స్టాప్‌లాస్: రూ.128.60 | డౌన్‌సైడ్ ప్రాఫిట్: 8%

గత కొద్ది నెలలుగా అశోక్ లేలాండ్ టాప్ గేరులో దూసుకుపోయింది. చివరికి గత శుక్రవారం ఈ ర్యాలీకి డ్రైవర్ బ్రేకులేయడంతో ప్రాఫిట్ బుకింగ్ మొదలైంది..20డేస్ ఈఎంఏ దిగువకు పడిపోయిది. 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా బ్రేక్ చేసింది. అలానే టెక్నికల్‌గా ఆర్ఎస్ఐ ఆసిలేటర్ కూడా కింది చూపులు చూడటం ప్రారంభమైంది. కాబట్టి కనీసం 8శాతం లాభానికి ఈ స్టాక్‌ని అమ్మితే రూ.114 వరకూ పడిపోతుందని ఏంజెల్ బ్రోకింగ్ సమీత్ చవాన్ రికమండ్ చేసారు. స్ట్రిక్ట్ స్టాప్‌లాస్ రూ.128.60 

అమ్మండి |యునైటెడ్ బ్రూవరీస్ |ఎల్‌టిపి:రూ.1,218.50| టార్గెట్:రూ.1,145 | స్టాప్‌లాస్: రూ.1,258 | డౌన్‌సైడ్ ప్రాఫిట్ : 6%

యూబీ కౌంటర్‌లోనూ గత మూడు నెలలుగా అద్భుతమైన ర్యాలీ గమనించారు. బుల్ రన్‌లో లేట్‌గా పార్టిసిపేట్ చేసినా, ట్రేడర్లకు మంచి లాభాలు పంచింది. ఇప్పుడు లాభం తీసుకునే టైమ్ వచ్చినట్లు కన్పిస్తోంది. స్టాక్ మార్కెట్లలో గత నాలుగు సెషన్లు నష్టాల్లో ముగిసినట్లే..ఈ కౌంటర్ కూడా కన్సాలిడేషన్ మోడ్‌లో ప్రవేశించింది. గత శుక్రవారం యూబీ కౌంటర్‌లో సెల్లింగ్ ప్రెజర్ స్పష్టంగా కన్పించింది. డైలీ ఛార్టులలో రేంజ్ బ్రేక్‌డౌన్ ప్యాటెర్న్ నమోదైంది. మొమెంటమ్ ఆసిలేటర్ కూడా యునైటెడ్ బ్రూవరీస్‌లో లాభాల స్వీకరణ కొనసాగుతుందనే సూచిస్తోంది. కాబట్టి ట్రేడర్లు రూ.1258 స్టాప్‌లాస్‌గా పెట్టుకుని రూ.1145 వచ్చేంత వరకూ విక్రయించవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ టెక్నికల్ డెరివేటివ్స్ చీఫ్ అనలిస్ట్ సమీత్ చవాన్ రికమండ్ చేశారు. 


( పై స్టాక్ రికమండేషన్స్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్.ఇన్ రికమండేషన్స్ కావు)

Expert's View


MTAR Technologies కాసుల వర్షం కురిపిస్తుందా?

Trending