బంగారం అమ్మేయండి, వెండి కొనండి దనియాలు దాచి పెట్టుకోండి

2021-03-02 16:55:35 By Anveshi

img

కమోడిటీస్ మార్కెట్‌లో టెక్నికల్ ఛార్టుల ఆధారంగా కేపిటల్‌వయా గ్లోబల్ సంస్థ టెక్నికల్ అనలిస్ట్ క్షితిజ్ పురోహిత్ బంగారం ట్రెండ్ బేరిష్‌గా ఉన్నట్లు
వెండి కాస్త బెటర్‌గా ఉన్నట్లు చెప్తున్నారు. ఆయన రికమండేషన్స్  చూడండి

గోల్డ్ | అమ్మండి | టార్గెట్ : రూ. 45,200
మొమెంటమ్ ఇండికేటర్ అయిన ఆర్ఎస్ఐ 30 పాయింట్ల వద్ద కదలాడుతోంది. మార్కెట్ కూడా ఓవర్‌సోల్డ్ జోన్‌లో ఉన్నట్లు కన్పిస్తుంది. అందుకే ట్రేడర్లు రూ.46,400 కనుక వస్తే, సెల్ పొజిషన్ తీసుకోవచ్చు. రూ.45,200 టార్గెట్ ధరగా స్టాప్‌లాస్ రూ.46780ని ఫిక్స్ చేసుకోమని క్షితిజ్ పురోహిత్ సూచించారు. 

వెండి | కొనండి | టార్గెట్:రూ. 69,500
ఈ వారమంతా ట్రేడర్లు బయ్ ఆన్ డిప్స్,( పడ్డప్పుడల్లా కొనే) స్ట్రాటజీ ఫాలో అవడం మంచింది. రూ.65500 దగ్గర ఎంట్రీ తీసుకుని రూ.69500 టార్గెట్‌గా పెట్టుకోవాలి. స్టాప్‌లాస్‌గా రూ.63500 ఫిక్స్ చేసుకోవాలని క్షితిజ్ పురోహిత్ సూచిస్తున్నారు. వోలటైల్ మార్కెట్‌లో కూడా వెండి కేజీ ధర రూ.67వేల కంటే దిగువన క్లోజవుతోంది. అమెరికా ప్రభుత్వం భారీగా స్టిమ్యులస్ ప్యాకేజీకి అనుమతించనున్న నేపథ్యలో ఇండస్ట్రియల్ మెటల్, సిల్వర్‌కి బాగా గిరాకీ ఏర్పడబోతోంది

 

క్రూడాయిల్  | కొనండి | టార్గెట్: రూ. 4,770

ఎంసిఎక్స్ క్రూడాయిల్  బయ్ ఆన్ డిప్స్ పద్దతిలో ట్రేడర్లు రూ.4520 వద్ద కొనుగోళ్లు చేయాలి.  స్టాప్‌లాస్ రూ.4370 దిగువన చూసుకుంటూ, 
రూ.4770 రేటు కోసం కొనుగోలు చేయవచ్చని క్షితిజ్ పురోహిత్ చెప్తున్నారు. బాండ్ ఈల్డ్స్ భారీగా రావడంతో క్రూడాయిల్ లో సెల్లాఫ్ చూశాం. ధర రూ.4670పైన కనుక సస్టెయిన్ అయితే క్రూడాయిల్ రేటు ఎంసిఎక్స్‌లో రూ.4800వరకూ కూడా వెళ్తుందని ఆయన రికమండ్ చేశారు. 
 

నేచురల్ గ్యాస్ | కొనండి | టార్గెట్: రూ. 220
ఈ వారం ట్రేడర్లు నేచురల్ గ్యాస్ సపోర్ట్ లెవల్స్ రూ.198-197పై ఓ కన్నేసి ఉంచాలి. రేటు కనుక సస్టెయిన్ అయితే, రూ.220 వరకూ కూడా
వెళ్లగలదు. నార్త్ ,సెంట్రల్ అమెరికాలో చలి వాతారణం దెబ్బకి జనం బైటికి రావడం మానేశారు. కనీసం మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందంటున్నారు..దీంతో నేచురల్ గ్యాస్‌ హీటింగ్ డిమాండ్ పెరుగుతుందని అంచనా. అందుకే నేచురల్ గ్యాస్‌ని రూ.220 టార్గెట్ కోసం 
రూ. 188 స్టాప్‌లాస్‌తో కొనవచ్చంటూ సూచించారు క్షితిజ్ పురోహిత్. 

కాపర్ ​| కొనండి | టార్గెట్ : రూ. 727
ప్రస్తుతం ట్రేడర్లు కాపర్ కొనుగోళ్లకి కొంత వెయిట్ చేయాలి. ఆర్ఎస్ఐ ఇండికేటర్ కాపర్ ఓవర్‌బాట్ పొజిషన్‌లో ఉన్నట్లు చెప్తోంది. కొద్దిగా ధరలో తగ్గుదల కన్పిస్తే రూ. 727 టార్గెట్‌గా రూ.685 స్టాప్‌లాస్‌ ఫిక్స్ చేసుకుని కాపర్ కొనుగోలు చేయాలి. ఈ మద్యనే ఏడాది గరిష్టానికి చేరిన రాగి..గ్లోబల్ గ్రోత్ అంచనా, బాండ్ ఈల్డ్స్ పెరుగుదలతో ఇంకా ర్యాలీ చేస్తుందని అంచనా


కొరియాండర్| కొనండి | టార్గెట్: రూ. 8,000
ట్రేడర్లు ఎన్‌సిడిఈఎక్స్‌లో ఏప్రిల్ దనియాల ఫ్యూచర్లను రూ.7160-రూ.7100 మధ్యలో ఎంట్రీ పాయింట్ తీసుకోవాలి.  రూ.6650 స్టాప్‌లాస్‌ ఫిక్స్ చేసుకుని రూ.7800-8000టార్గెట్ ధర కోసం దనియాలను కొనవచ్చని వెంచురా సెక్యూరిటీస్ హెడ్ రామస్వామి సూచించారు

( పై రికమండేషన్స్ ఆయా అనలిస్టులవి మాత్రమే సైట్‌వి కాదు)

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending