హాట్ పిక్స్.. వెరీ షార్ట్ టర్మ్ కోసం ఈ 3 స్టాక్స్‌పై ఓ లుక్ వేయండి

2021-02-23 09:36:27 By Anveshi

img

స్టాక్ మార్కెట్లలో ఇవాళ షార్ట్ కవరింగ్‌తో గ్యాప్ అప్ ఓపెనింగ్ కన్పించింది. నిన్న నిఫ్టీ  20 డేస్ ఈఎంఏ కి దిగువన ట్రేడైంది దీంతో షార్ట్ టర్మ్‌లో నెగటివ్ ట్రెండ్ కన్పిస్తున్నట్లు టెక్నికల్ నందీష్ షా చెప్తున్నారు. ఇవాళ కూడా 14336 పాయింట్ల దిగువన కనుక క్లోజైతే ఈ కరెక్షన్ ఇంకా కొనసాగవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌కి చెందిన నందీష్ షా ఓ 3 స్టాక్స్‌పై ఫోకస్ పెట్టమంటున్నారు..వాటిలో ఒకదానికి కొనమని..మరో 2 స్టాక్స్ విక్రయించమంటూ సలహా ఇచ్చారాయన.

1. ఫెడరల్ బ్యాంక్ అమ్మండి రూ. 79.75 | టార్గెట్ ప్రైస్ రూ.72 | స్టాప్‌లాస్ రూ.84 | డౌన్ సైడ్ ప్రాఫిట్ -10శాతం

డైలీ ఛార్టులలో హయ్యర్ వాల్యూమ్స్‌తో ఫెడరల్ బ్యాంక్ స్టాక్ ధర పతనమవుతోంది. ఫిబ్రవరి 1 స్థాయికి గత సెషన్‌లో పడిపోయిది. 5 రోజులు, 20 రోజుల ఈఎంఏ దిగువన షేరు కదలాడటం షార్ట్ టర్మ్‌లో ఈ కౌంటర్ ట్రెండ్ నెగటివ్‌గా మారిందనడానికి సంకేతం. ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా స్లోపింగ్ ట్రెండ్ లైన్ నుంచి బ్రేక్ అయింది. ప్రవేట్ బ్యాంకులన్నీ కూడా
చార్టులపై బలహీనంగా కన్పించడం మరో కారణం.

2.M & M అమ్మండి రూ.838.20 | టార్గెట్ ప్రైస్ రూ.778 |  స్టాప్‌లాస్. రూ.880|  డౌన్ సైడ్ ప్రాఫిట్ రూ.7శాతం

20డేస్ ఈఎంఏ దిగువన భారీ వాల్యూమ్స్‌తో బ్రేక్ అయింది. షార్ట్ టర్మ్‌లో స్టాక్ ధర పతన దిశను సూచిస్తోంది. ఆర్ఎస్ఐ, ఎంఎఫ్ఐలు కూడా ధరలోని బలహీనతను సూచిస్తున్నాయ్.దీంతో పాటు ఆటోసెక్టార్ స్టాక్స్‌లోనూ వీక్‌నెక్ కన్పిస్తోంది. 

3.కొనండి ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ కొనండి| రూ.101.90 | టార్గెట్ ప్రైస్ రూ. 115 | స్టాప్‌లాస్ రూ.96 |అప్సైడ్ ప్రాఫిట్ 13శాతం

డిసెంబర్ 28 నాటి ధరను భారీ వాల్యూమ్స్‌తో బ్రేక్ చేసింది. డైలీ ఛార్టులలో అన్ని మూవింగ్ యావరేజ్‌లను దాటేసింది. ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా స్టాక్‌లోని స్ట్రెంగ్త్‌ని సూచిస్తోంది. 

( పై రికమండేషన్స్ సదరు అనలిస్ట్‌వే తప్ప సైట్‌వి కాదు గమనించగలరు..మీ లాభనష్టాలకు మీరే బాధ్యులు)

Expert's View


MTAR Technologies కాసుల వర్షం కురిపిస్తుందా?

Trending