మూలిగే నక్కమీద తాటికాయ కాదు బండరాయి..! AT-1 బాండ్ల కేసులో యెస్ బ్యాంక్‌పై రూ.25కోట్ల ఫైన్

2021-04-13 12:21:54 By Anveshi

img

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి, ఫౌండర్ కమ్ ప్రమోటర్ చేసిన మోసాలకు బలైపోయిన యెస్‌ బ్యాంక్‌ని కష్టాలు వదలడం లేదు
తాజాగా ఏ1-1 బాండ్స్ కేసులో అవకతవకలకు పాల్పడినందుకు బ్యాంకుపై, ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లపై పాతిక కోట్ల రూపాయల జరిమానా పడింది. ఈ మేరకు సెబీ ఈ జరిమానా విధించగా, దానిపై అప్పీల్ చేసుకునేందుకు వీలు కల్పించింది

 

ఫిక్స్‌డ్ డిపాజిట్లు వేసిన కస్టమర్లను బలవంతంగా, మోసపూరితంగా AT-1 బాండ్ల వైపు మళ్లించారనేది వీరిపై ఉన్న ఆరోపణ. ఏటి-1 అంటే అడిషనల్ టైర్ వన్ బాండ్లు. 

యెస్ బ్యాంక్ ప్రవేట్ వెల్త్ మేనేజ్‌మెంట్‌కి చెందిన వివేక్ కన్వర్‌పై కోటి రూపాయలు, ఆశిష్ నాసా, జస్జీచ్ సింగ్ బంగాపై తలా రూ.50లక్షల జరిమానా వేసింది సెబీ.సెబీకి యెస్ బ్యాంకు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందుకున్న తర్వాత విచారణ జరపగా, ఏటి-1 బాండ్ల విషయంలో వారి ఫిర్యాదులు వాస్తవమే అని తేలింది.యెస్ బ్యాంక్ ఈ బాండ్లను 2016 డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 29,2020 మధ్యలో విక్రయించింది. బయ్యర్ల ఇష్టంతో నిమిత్తం లేకుండా, యెస్ బ్యాంక్ యాజమాన్యం నేరుగా తమ బ్యాంక్‌లోని 1300మంది కస్టమర్ల చేత వీటిని కొనుగోలు చేయించింది. పైగా వాటికి సూపర్ FD అంటూ కొత్త ప్రొడక్ట్స్‌లాగా
బిల్డప్ ఇచ్చిందని సెబీ తేల్చింది. 

 

అలానే ఇన్వెస్టర్లకు ఈ బాండ్ల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కన్ఫర్మేషన్ తీసుకోకుండానే బాండ్ల విక్రయాలు చేసినట్లు సెబీ తేల్చింది. ఈ కస్టమర్లలో చాలామంది 70,80,90ఏళ్ల వయసున్నవారు కూడా ఉన్నారు. రిస్క్ తదితర వివరాలు తెలియజేయకుండా కస్టమర్ల అనుమతి తీసుకోకుండా ఇలా చేసిన యెస్ బ్యాంక్ నిర్వాకం నిజమే అని తేలడంతో ఈ బ్యాంకు వ్యవహారాలపై నీలినీడలు కమ్ముకోవడం సహజమే!

ప్రస్తుతం యెస్ బ్యాంక్ షేర్లు 0.35శాతం లాభంతో రూ.14.50వద్ద ట్రేడ్ అయ్యాయ్


yes bank AT-1 tier bonds case fine.25 crores sebi telugu stock market profit trade

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending